పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? అయితే ఈ 5 విషయాలు అస్సలు మర్చిపోకండి!

by Ajay Maddhiboyina |

ప్ర‌స్తుతం చాలా మంది ప‌ర్స‌న‌ల్ లోన్స్ తీసుకుంటున్నారు. ఏ అవ‌స‌రం వ‌చ్చినా సులువుగా ఫోన్ లోనే లోన్ రావ‌డంతో ఏమీ ప‌ట్టించుకోకుండా తీసుకుంటున్నారు. కొంత‌మంది బ్యాంకుల నుండి రుణాలు తీసుకుంటే మ‌రికొంద‌రు లోన్ యాప్ లు, బ్యాకింక్ యాప్స్ ద్వారా లోన్లు తీసుకుంటున్నారు.

పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? అయితే ఈ 5 విషయాలు అస్సలు మర్చిపోకండి!
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్ర‌స్తుతం చాలా మంది ప‌ర్స‌న‌ల్ లోన్స్ తీసుకుంటున్నారు. ఏ అవ‌స‌రం వ‌చ్చినా సులువుగా ఫోన్ లోనే లోన్ రావ‌డంతో ఏమీ ప‌ట్టించుకోకుండా తీసుకుంటున్నారు. కొంత‌మంది బ్యాంకుల నుండి రుణాలు తీసుకుంటే మ‌రికొంద‌రు లోన్ యాప్ లు, బ్యాకింక్ యాప్స్ ద్వారా లోన్లు తీసుకుంటున్నారు. అయితే ప‌ర్స‌న‌ల్ లోన్ తీసుకునేట‌ప్పుడు 5 విష‌యాలు చాలా మంది ప‌ట్టించుకోవ‌డంలేదని, దానివ‌ల్ల న‌ష్ట‌పోతార‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

మీ క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోండి:

ప‌ర్స‌న‌ల్ లోన్ రావాలంటే క్రెడిట్ స్కోర్ ముఖ్య‌పాత్ర పోషిస్తుంది. అంతే కాకుండా వ‌డ్డీరేటు నిర్ణ‌యించ‌డంలో కూడా క్రెడిట్ స్కోర్ పాత్ర ఉంటుంది. క్రెడిట్ స్కోర్ ఎక్కువ ఉన్న‌ట్ట‌యితే మెరుగైన వ‌డ్డీరేటుకు రుణాలు వ‌స్తాయి. అంతే కాకుండా లోన్ అప్లై చేసేముందు క్రెడిట్ స్కోర్ దెబ్బ‌తీసే ఏవైనా మిస్టేక్స్ ఉంటే వాటిని స‌రిచేసుకోవాలి. దానివ‌ల్ల లోన్ క్యాన్సిల్ చేసే అవ‌కాశం ఉండ‌దు.

బెస్ట్ ఆఫ‌ర్స్ కోసం ఇత‌ర బ్యాంకుల‌ను సైతం సంప్ర‌దించండి:

లోన్ తీసుకునేట‌ప్పుడు కేవ‌లం పెద్ద పెద్ద బ్యాంకుల‌నే కాకుండా చిన్న బ్యాంకుల్లోనూ ప‌ర్స‌న‌ల్ లోన్ ఆఫ‌ర్ల‌ను చెక్ చేయాలి. కొన్ని చిన్న బ్యాంకులు వెంట‌నే లోన్ అప్రూవ్ చేయ‌డం, సులువైన ఈఎంఐలు, సులువుగా ఫోర్స్ క్లోజ్ చేసుకునే అవ‌కాశాలను క‌ల్పిస్తాయి. కాబ‌ట్టి లోన్ తీసుకునేముందు స‌రైన ఆఫ‌ర్ కోసం వెత‌క‌డం చాలా అవ‌స‌రం.

వ‌డ్డీ రేట్లు, లోన్ ప్రాసెసింగ్ ఫీజుల‌ను పోల్చుకోవాలి:

లోన్ తీసుకునేట‌ప్పుడు ప్రాసెసింగ్ ఫీజు, వ‌డ్డీరేటు క‌చ్చితంగా చూసుకోవాలి. కొన్ని బ్యాంకులు త‌ర‌చుగా ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేష‌న్ ఛార్జీలు మ‌రియు ఫోర్స్ క్లోజ్ ఛార్జీలు లాంటి నిబంధ‌న‌లు పెడ‌తాయి. కాబ‌ట్టి ముందే వాటిని ఇత‌ర బ్యాంకుల‌తో పోల్చుకోవ‌డం మంచింది. వ‌డ్డీ రేటులో 0.5 శాతం తేడా ఉన్నా అది మీకు లాభం అవుతుంది.

EMI కాలిక్యులేట‌ర్ ఉప‌యోగించండి:

లోన్ వ‌స్తుంది క‌దా అని EMI గురించి ఆలోచించ‌కుండా తీసుకుంటూ ఉంటారు. అయితే మీ నెల‌వారి EMI త‌గ్గితే ఎక్కువ కాల‌ప‌రిమితి వ‌స్తుంది కానీ వ‌డ్డీ పెరుగుతుంది. ఒక‌వేళ త‌గ్గితే మీరు నెల‌కు ఎక్కువ మొత్తంలో క‌ట్టాల్సి ఉంటుంది. దాని వ‌ల్ల ప్ర‌తినెల ఇబ్బందిప‌డ‌తారు. కాబ‌ట్టి ఎలా ప‌డితే అలా సెలెక్ట్ చేయ‌కుండా EMI కాలిక్యులేట‌ర్ ఉప‌యోగించి మీ జీతంలో 30 నుండి 40 శాతం మీ నెల‌వారి EMI మించ‌కుండా ఉండేలా చూసుకోవాలి.

ఫైన్ ప్రింట్ చ‌ద‌వాలి:

ప‌ర్స‌న‌ల్ లోన్ ఒప్పందంలో వ‌డ్డీ, ఈఎంఐ షెడ్యూల్, నిబంధ‌న‌లు లాంటి కీల‌క విష‌యాలు ఉంటాయి. కాబ‌ట్టి సంతకం చేసే ముందు ఆ నిబంధ‌న‌లు క‌చ్చితంగా చ‌ద‌వాలి. ఒక‌వేళ‌ అందులో మీకు ఇబ్బంది క‌లిగే అంశాలు ఉంటే వెంట‌నే లోన్ క్యాన్సిల్ చేసుకోవాలి. కాబ‌ట్టి ఈ విష‌యాలు తెలియాలి అంటే ఫైన్ ప్రింట్ చ‌ద‌వ‌డం ఎంతో అవ‌స‌రం.

Next Story