మోటో నుంచి మ‌డ‌త‌పెట్టే ఫోన్‌..ధ‌ర‌, ఫీచ‌ర్స్ ఇవే

by velandi.Saikiran |

మోటరోలా రేజర్ 70 అల్ట్రా ( Motorola Razr 70 Ultra) పేరుతో ఈ ఫోన్ తీసుకువస్తుంది కంపెనీ.

మోటో నుంచి మ‌డ‌త‌పెట్టే ఫోన్‌..ధ‌ర‌, ఫీచ‌ర్స్ ఇవే
X

దిశ‌, వెబ్ డెస్క్‌: మోటరోలా మొబైల్స్.. మిడిల్ క్లాస్ వాళ్లు ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇందులో తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ ఉన్న ఫోన్లు చాలానే ఉంటాయి. మిడిల్ క్లాస్ వాళ్లను బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి ఈ మోటరోలా ఫోన్లు. దానికి తగ్గట్టుగానే రకరకాల మోడల్స్ లో ఫోన్లను తీసుకువస్తోంది కంపెనీ. అయితే తాజాగా మరో కీలక ప్రకటన చేసింది మోటరోలా. ఎక్కువ ధరలో ఫోల్డబుల్ ఫోన్ తీసుకురానుంది. మోటరోలా రేజర్ 70 అల్ట్రా ( Motorola Razr 70 Ultra) పేరుతో ఈ ఫోన్ తీసుకువస్తుంది కంపెనీ. ఈ ఫోన్ ఏప్రిల్ చివరలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదా మే మొదటి వారంలో లాంచ్ కావచ్చు.

Motorola Razr 70 Ultra ధ‌ర‌, ఫీచ‌ర్స్ !

ఇక ఈ Motorola Razr 70 Ultra ఫీచర్స్ ఒకసారి పరిశీలిస్తే, 6.9 అంగుళాల డిస్ప్లే కలిగి ఉన్న ఈ ఫోన్ 165hz రిఫ్రెష్‌ రేటు కలిగి ఉంటుంది. అయితే ఈ ఫోన్ మడత పెట్టినప్పుడు 4 అంగుళాలు మాత్రమే కనిపిస్తుంది. ఈ మొబైల్ మడ‌త‌పెట్టి ఉన్నప్పటికి కూడా యాప్స్ వాడుకునేలా సెటప్ చేశారు. బ్యాక్ కెమెరా 50 ఎంపీ కాగా సెల్ఫీల కోసం 32 MP కెమెరాలు అందిస్తున్నారు. 4500 mah బ్యాటరీ సామర్థ్యంతో ఈ ఫోన్ లాంచ్ చేసేందుకు కంపెనీ నిర్ణయం తీసుకుంది. 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేయనుంది. మిడ్ నైట్ బ్లూ, స్ప్రింగ్ గ్రీన్, పీచ్ ఫజ్ లాంటి కలర్స్ లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. సాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ పోలికలతో ఈ మోటరోలా రేజర్ 70 అల్ట్రా మొబైల్ ఉండనుంది.

Next Story