6,500mAh మోటో నుంచి మ‌రో క్రేజీ ఫోన్‌..ధ‌ర, ఫీచ‌ర్స్ ఇవే

by velandi.Saikiran |

మోటరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ పేరుతో కొత్త ఫోన్ ఈనెల చివరి వారంలో లాంఛ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

6,500mAh మోటో నుంచి మ‌రో క్రేజీ ఫోన్‌..ధ‌ర, ఫీచ‌ర్స్ ఇవే
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇండియన్ మార్కెట్లోకి అనేక రకాల మొబైల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ఫీచర్లు ఉన్న మొబైల్స్ కు మంచి గిరాకీ ఉంటోంది. దానికి తగ్గట్టుగానే కంపెనీలు కూడా మిడిల్ క్లాస్ వాళ్ళను టార్గెట్ చేసుకొని మొబైల్స్ లాంచ్ చేస్తున్నాయి. అయితే తాజాగా మోటరోలా కంపెనీ నుంచి సరికొత్త ఫోన్ లాంచ్ అయ్యేందుకు సిద్ధమైంది. మోటరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ ( Motorola Edge 70 Pro+) పేరుతో కొత్త ఫోన్ ఈనెల చివరి వారంలో లాంఛ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి.

Motorola Edge 70 Pro+ మొబైల్ ఫీచ‌ర్స్ ఒక‌సారి ప‌రిశీలిస్తే, 6.78 అంగుళాల డిస్ ప్లేతో ఈ ఫోన్ రానుంది. 8500 డైమెన్‌సిటీ క‌లిగి ఉండ‌నుంది. 50MP OIS + 50MP + 50MP సామ‌ర్థ్యంతో బ్యాక్ కెమెరా అందిస్తోంది మోట‌రోలా. సెల్ఫీల కోసం 50MP కెమెరా ఉంటుంది. 6500mAh బ్యాట‌రీ సామ‌ర్థ్యం ఉన్న ఈ ఫోన్ కు 90W + 15W వైర్ లెస్ ఛార్జెర్ స‌పోర్ట్ చేయ‌నుంది. ఇండియాలో ఈ ఫోన్ లాంఛ్ అయితే, రూ.50 వేల వ‌ర‌కు ఉండ‌నున్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు.

Next Story