Motorola Edge 70 Pro: 6500mah బ్యాట‌రీతో మోటరోలా..ధ‌ర‌, ఫీచ‌ర్స్ ఇవే

by velandi.Saikiran |

మోటరోలా ఎడ్జ్ 70 ప్రో మొబైల్ మార్కెట్ లోకి రానుంది.

Motorola Edge 70 Pro: 6500mah బ్యాట‌రీతో మోటరోలా..ధ‌ర‌, ఫీచ‌ర్స్ ఇవే
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఇండియన్ మార్కెట్ లో మోటరోలా కంపెనీకి ఉన్న పాపులారిటీ అంతా కాదు. ఈ కంపెనీ నుంచి వచ్చిన మొబైల్స్ కు మంచి గిరాకీ ఉంటుంది. సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలా ధరలు ఉంటాయి. అందుకే జనాలు..ఈ ఫోన్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. అయితే లేటెస్ట్ గా ఈ కంపెనీ నుంచి మోటరోలా 'ఎడ్జ్ 70 ప్రో' ( Motorola Edge 70 Pro) స్మార్ట్ ఫోన్ రాబోతోంది. ఏప్రిల్ 26వ తేదీన ఈ మొబైల్ రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మోటరోలా 'ఎడ్జ్ 70 ప్రో' ఫీచర్

ఇండియన్ మార్కెట్లోకి త్వరలో రిలీజ్ కాబోతున్న మోటరోలా 'ఎడ్జ్ 70 ప్రో' 6.7 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉంటుంది. బ్యాక్ కెమెరా 50 MP ప్రధాన కెమెరాతో పాటు టెలిఫోటో లెన్స్ కూడా ఉంటాయి. సెల్ఫీల కోసం 50 ఎంపీతో ఫ్రంట్ కెమెరా కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. 125W ఫాస్ట్ చార్జర్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ బ్యాటరీ 6500 mah సామర్థ్యం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఫోన్లు కూడా ప్రీమియం వేగన్ లెదర్ ఫినిష్ తో వస్తాయని చెబుతున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం ఇండియాలో ఈ మొబైల్ ధర రూ.25 వేల నుంచి రూ.30 వేల మ‌ధ్య ఉండే అవకాశాలు ఉన్నాయి.

Next Story