Motorola: మోటోరోలాపై బంప‌ర్ ఆఫ‌ర్‌..కేవ‌లం రూ. 19,000 లకే !

by velandi.Saikiran |

మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్ మొబైల్ ఫోన్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లలో రూ. 18500 నుంచి రూ. 19, 500 మధ్యలో లభిస్తోంది.

Motorola:  మోటోరోలాపై బంప‌ర్ ఆఫ‌ర్‌..కేవ‌లం రూ. 19,000 లకే !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఇండియన్ మార్కెట్ లోకి అనేక రకాల మొబైల్ ఫోన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. తక్కువ ధరలో మంచి ఫీచర్స్ ఉన్న మొబైళ్ల‌కు ఇండియాలో గిరాకీ బాగానే ఉంటుంది. ముఖ్యంగా మోటరోలా నుంచి వచ్చిన ప్రతి ఫోన్ తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో లాంచ్ అవుతున్నాయి. అలా వచ్చిన మొబైలే ఈ మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్. ఈ ఫోన్ ప్రస్తుతం ఆన్లైన్ లో కేవలం రూ. 19 వేలకు మాత్రమే లభిస్తోంది.

మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్ ( Motorola Edge 60 Stylus) మొబైల్ ఫోన్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లలో రూ. 18500 నుంచి రూ. 19, 500 మధ్యలో లభిస్తోంది. వాస్త‌వంగా ఈ మొబైల్ ఫోన్ లాంచ్ అయినప్పుడు రూ. 23 వేలుగా ఉంది. కానీ ఇప్పుడు దాదాపు 3 వేలకు పైగా డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్ కొనుగోలు చేస్తే నేరుగా రూ. 2500 పైగా డిస్కౌంట్ అందిస్తోంది కంపెనీ. అలాగే ఈ ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు క్రెడిట్ కార్డు ఆఫర్లు ఉపయోగిస్తే, మరో 1500 రూపాయల వరకు డిస్కౌంట్ అందుతుంది. అంటే ఈ లెక్కన రూ.19 వేలకు మొబైల్ మన చేతికి వస్తుందన్నమాట.

Motorola Edge 60 Stylus అదిరిపోయే ఫీచర్స్

6.67 అంగుళాల డిస్ప్లే కలిగి ఉన్న ఈ Motorola Edge 60 Stylus ఫోన్, 5000 mah బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంటుంది. 68 W ఫాస్ట్ చార్జర్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. మెయిన్ కెమెరా 50 MP కాగా సెల్ఫీల కోసం 32 MP కెపాసిటీతో కెమెరాను అందిస్తున్నారు. 4k వీడియో రికార్డింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది.

Next Story