- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Motorola: చీప్ అండ్ బెస్ట్..మోటరోలా నుంచి అదిరే ఫీచర్లతో మరో పవర్‌ఫుల్ ఫోన్ లాంచ్
motorola edge 60 fusion: ప్రముఖ మొబైల్ కంపెనీ మోటోరొలా సంస్థ కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది.

దిశ, వెబ్ డెస్క్: motorola edge 60 fusion: ప్రముఖ మొబైల్ కంపెనీ మోటోరొలా సంస్థ కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 22, 999గా ఉంది. గత ఏడాది ఎడ్జ్ 50 ఫ్యూజన్ ను తీసుకువచ్చింది. తాజాగా ఎడ్జ్ 60 ఫ్యూజన్ ను లాంచ్ చేసింది. 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
కొత్త మోటో ఫ్యూజన్ ఫోన్‌లో 6.7-అంగుళాల 1.5K రిజల్యూషన్ కర్వ్డ్ డిస్‌ప్లే, pOLED ప్యానెల్ ఉన్నాయి. డిస్ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. 12 GB వరకు RAM అందించింది. 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ అందుబాటులో ఉంది. కొత్త మోటరోలా ఫోన్ తాజా ఆండ్రాయిడ్ 15 పై నడుస్తుంది. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5500 mAh బ్యాటరీ, 68 వాట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఇందులో అందించింది. ఈ ఫోన్ MediaTek Dimensity ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్‌లో ప్రత్యేకత గురించి తెలుసుకుందాం.
మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ మూడు రంగులలో ప్రారంభించింది. పాంటోన్ స్లిప్‌స్ట్రీమ్, పాంటోన్ జెఫిర్, పాంటోన్ అమెజోనైట్ రంగులు. దీని 8GB + 256GB మోడల్ ధర రూ.22,999. 12GB + 256GB మోడల్ ఫోన్ ధర రూ. 24999. ఈ ఫోన్ అమ్మకం ఏప్రిల్ 9న మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమవుతుంది. దీనిని మోటరోలా ఆన్‌లైన్ స్టోర్, ప్రధాన రిటైల్ స్టోర్‌ల నుండి కూడా కొనుగోలు చేయవచ్చు.
మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ తో లాంచ్ ఆఫర్లు కూడా వచ్చాయి. యాక్సిస్ బ్యాంక్, ఐడిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఫోన్ కొనుగోలు చేస్తే రూ. 2,000 తగ్గింపు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ నుండి ఫోన్ కొనుగోలు చేస్తే రూ. 2,000 ఎక్స్ఛేంజ్ విలువ అందిస్తోంది. ఈ ఫోన్ కొనుగోలుపై రిలయన్స్ జియో రూ. 10,000 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది.
మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 6.7-అంగుళాల FHD+ డిస్‌ప్లేను 2712 x 1220 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో కలిగి ఉంది. ఇది OLED డిస్ప్లే. డిస్ప్లేలో HDR10+, 120 Hz రిఫ్రెష్ రేట్ అందుబాటులో ఉన్నాయి. ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణను కలిగి ఉంది. 4500 నిట్‌ల గరిష్ట బ్రైట్ నెస్ అందిస్తుంది.మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీనితో 12 GB వరకు RAM అందించింది. 256 GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ అందుబాటులో ఉంది. SD కార్డ్‌ని చొప్పించడం ద్వారా స్టోరేజీని మరింత విస్తరించవచ్చు. కొత్త మోటరోలా ఫోన్ తాజా ఆండ్రాయిడ్ 15 పై నడుస్తుంది. ఫోన్‌లో డ్యూయల్ సిమ్ స్లాట్ అందించింది. SD కార్డ్ స్లాట్ విడిగా అందుబాటులో ఉంది.






