- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MOTO X70 AIR: ఐఫోన్ 17 ఎయిర్, గెలాక్సీ ఎస్25 ఎడ్జ్‌లకు పోటీగా మోటో కొత్త ఫోన్.. లాంఛింగ్ తేదీ, ఫీచర్స్ ఇవే
స్మార్ట్ ఫోన్ లవర్స్ అభిరుచులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. వినియోగదారుల అభిరుచుల ఆధారంగానే సరికొత్త డిజైన్లను కంపెనీలు మార్కెట్ లోకి రిలీజ్ చేస్తుంటాయి. ఆపిల్ ఐఫోన్ ఎయిర్ నుండి గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ వరకు వచ్చిన స్టార్ట్ ఫోన్స్ అన్నీ సన్నని డిజైన్ తో వచ్చినవే. ఇక ఇప్పుడు మోటరోలా కూడా ఓ సన్నని స్మార్ట్ ఫోన్ ను ఇండియా మార్కెట్ లో ప్రవేశపెట్టబోతుంది.

దిశ, వెబ్ డెస్క్: స్మార్ట్ ఫోన్ లవర్స్ అభిరుచులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. వినియోగదారుల అభిరుచుల ఆధారంగానే సరికొత్త డిజైన్లను కంపెనీలు మార్కెట్ లోకి రిలీజ్ చేస్తుంటాయి. ఆపిల్ ఐఫోన్ ఎయిర్ నుండి గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ వరకు వచ్చిన స్టార్ట్ ఫోన్స్ అన్నీ సన్నని డిజైన్ తో వచ్చినవే. ఇక ఇప్పుడు మోటరోలా కూడా ఓ సన్నని స్మార్ట్ ఫోన్ ను ఇండియా మార్కెట్ లో ప్రవేశపెట్టబోతుంది. మోటో ఎక్స్ 70 ఎయిర్ పేరుతో ఈ మొబైల్ ను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినా స్పెసిఫికేషన్స్ ఇవే అంటూ టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇది Snapdragon 8 Elite Gen 5 చిప్ సెట్ తో పనిచేసే మొదటి ఫోన్ కావచ్చని అంచనా వేస్తున్నారు.
ఈ ఫోన్ లో బ్యాక్ కెమెరా కాస్త పైకి ఉబ్బిన డిజైన్ తో ఐఫోన్ ప్రో కెమెరా మాధిరిగా తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ ఫోన్ 5.6mm మందం మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. అంటే ఇది కూడా ఐఫోన్ ఎయిర్, గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్ లతో సమానంగా ఉండనుంది. మోటో X70 ఎయిర్ అక్బోబర్ చివరినాటికి చైనాలో విడుదల కాబోతుందని మోటరోలా ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఇక భారత్ లో ఈ ఫోన్ 2025 చిరవలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ధర విషయానికి వస్తే ఇండియాలో దీనికి దాదాపు రూ.60వేల నుండి రూ.70వేల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.






