Moto: రూ. 20వేల లోపే సరికొత్త 5G ఫోన్లు..ఫీచ‌ర్స్ ఇవే !

by velandi.Saikiran |

7,000 mAh బ్యాట‌రీతో మోటో నుంచి రెండు ఫోన్లు లాంచ్ అయ్యాయి.

Moto: రూ. 20వేల లోపే సరికొత్త 5G ఫోన్లు..ఫీచ‌ర్స్ ఇవే !
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ మార్కెట్లోకి అనేక రకాల మొబైల్స్ వస్తున్నాయి. కానీ ఇందులో కొన్ని మాత్రమే సామాన్యులను ఆకట్టుకుంటున్నాయి. అలాంటి వాటిలో మోటో ఫోన్లు ముందు వ‌రుస‌లో ఉంటాయి. ఈ కంపెనీ నుంచి వస్తున్న మొబైల్స్ కొనుగోలు చేసేందుకు మిడిల్ క్లాస్ వాళ్ళు ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే మిడిల్ రేంజ్ ధరలలో కొత్త ఫోన్స్ తీసుకొస్తుంది కంపెనీ. లేటెస్ట్ గా మరో రెండు 5జి స్మార్ట్ ఫోన్లు తీసుకువచ్చింది. మోటో G 37 (Moto G37), మోటో G 37 పవర్ ( Moto G37 power) పేరుతో రెండు మోడల్స్ లాంచ్ అయ్యాయి. ఈ రెండు కూడా బడ్జెట్ ఫోన్స్ కావడం గమనార్హం.

మోటో G 37, మోటో G 37 ప‌వ‌ర్ ఫీచ‌ర్స్ ఇవే

మోటో G 37 ఫోన్ 6.6 అంగుళాల డిస్ ప్లే క‌లిగి ఉండ‌నుండ‌గా దీని బ్యాట‌రీ సామ‌ర్థ్యం 5200mAhగా ఉంటుంది. ఈ ఫోన్ 20w ఫాస్ట్ ఛార్జింగ్ కాగా... 6400 మీడియాటెక్ డైమెన్సిటీ కలిగి ఉంటుంది. ఇందులో సెల్ఫీల కోసం 8 ఎంపీ కెమెరా ఉంటే, బ్యాక్ కెమెరా 50 ఎంపీ ఉండనుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారంగా ఈ ఫోన్ పని చేస్తుంది. మోటో G37 పవర్ మొబైల్ 6.7 అంగుళాల డిస్ ప్లేతో రానుంది. ఈ ఫోన్ కూడా 6400 మీడియా టెక్ డైమెన్సిటీ కలిగి ఉంటుంది. 30W టర్బో ఛార్జర్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. మోటో G 37 పవర్ 7000mAh బ్యాట‌రీ క‌లిగి ఉండ‌నుంది. ఇందులో కూడా సెల్ఫీల కోసం 8 ఎంపీ కెమెరా ఉంటే, బ్యాక్ కెమెరా 50 ఎంపీ ఉండనుంది. Moto G37 series ధ‌ర రూ.13,999గా ఫిక్స్ చేశారు. G37 Power మొబైల్స్ ధ‌ర‌ రూ.14,999 నుంచి ప్రారంభం కానుంది.

Next Story