మోటోరోలా నుంచి బ‌డ్జెట్‌లో ఫోన్‌..ధ‌ర‌, ఫీచ‌ర్స్ ఇవే

by velandi.Saikiran |   (  Updated:2025-10-08 11:38:19  IST  )

ఇండియన్ మార్కెట్లోకి రకరకాల స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి. తక్కువ ధరలో సామాన్యులకు అందుబాటులో ఉండేలా మొబైల్ ఫోన్స్

మోటోరోలా నుంచి బ‌డ్జెట్‌లో ఫోన్‌..ధ‌ర‌, ఫీచ‌ర్స్ ఇవే
X

దిశ‌, వెబ్ డెస్క్ : ఇండియన్ మార్కెట్లోకి రకరకాల స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి. తక్కువ ధరలో సామాన్యులకు అందుబాటులో ఉండేలా మొబైల్ ఫోన్స్ వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మోటార సరికొత్త ఫోన్ తీసుకువచ్చింది. మోటోరోలా జి06 పవర్ ( Moto G06 Power) పేరుతో ఈ మొబైల్ ను తీసుకువచ్చారు. ఈ మొబైల్ ధర 7499 రూపాయలుగా ఫిక్స్ చేశారు.

4 జీబీ అలాగే 64 జీబీ సింగిల్ వేరియంట్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. మోటోరోలాకు సంబంధించిన అధికారిక వెబ్సైట్, ఈ కామర్స్ సంస్థల్లో అందుబాటులోకి రానుంది. అక్టోబర్ 11వ తేదీ నుంచి ఈ మొబైల్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఇక ఈ మోటోరోలాకు 6.8 అంగుళాల హెచ్ డీ డిస్ప్లే ఉంటుంది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్ 3 డిస్ప్లే ప్రొడక్షన్ అందిస్తున్నారు. ఇందులో 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 50 ఎంపీ మెయిన్ కెమెరా అందిస్తున్నారు. 7000 mah బ్యాటరీ కూడా ఉంటుంది.

Next Story