5 వేల‌కే మోటోరోలా ఫోన్‌..7,000 బ్యాట‌రీ, ఫీచ‌ర్స్ ఇవే !

by velandi.Saikiran |

4 జీబీ ర్యామ్‌తో పాటు 64 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది ఈ మొబైల్. అయితే ఈ పవర్ మొబైల్ ఫోన్ ధర 7,499 రూపాయలుగా ఫిక్స్

5 వేల‌కే మోటోరోలా ఫోన్‌..7,000 బ్యాట‌రీ, ఫీచ‌ర్స్ ఇవే !
X

దిశ‌, వెబ్ డెస్క్ : ఇండియన్ మార్కెట్లోకి అనేక రకాల మొబైల్ ఫోన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కొన్ని ఎక్కువ ధరలో, మరికొన్ని తక్కువ ధరలో లభిస్తున్నాయి. ఈ తరుణంలోనే సామాన్యులకు అందుబాటులో ఉండేలా వచ్చిన తాజా మొబైల్ మోటో G06 పవర్ ( Moto G06 Power). ఈ 4జీ స్మార్ట్ ఫోన్ ను ఈ నెల మొదటి వారంలోనే మోటరోలా కంపెనీ రిలీజ్ చేసింది. ఏకంగా 7000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం, 50 MP మెయిన్ కెమెరాతో ఈ మొబైల్ ను తీసుకువచ్చారు. సెల్ఫీల కోసం 8MP కెమెరా అందిస్తున్నారు. 6.68 ఇంచుల స్క్రీన్ కలిగిన ఈ మొబైల్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది.

4 జీబీ ర్యామ్‌తో పాటు 64 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది ఈ మొబైల్. అయితే ఈ పవర్ మొబైల్ ఫోన్ ధర 7,499 రూపాయలుగా ఫిక్స్ చేశారు. కానీ దీపావళి పండుగ సందర్భంగా ఈ మొబైల్ పై భారీ ఆఫర్ ప్రకటించింది కంపెనీ. క్రెడిట్ కార్డ్ వాడి ఈ మొబైల్ ఫోన్ కొంటే 300 రూపాయలు సేవ్ అవుతుంది. అలాగే మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే, దాదాపు రూ.2500 నుంచి రూ.3,000 వరకు తగ్గింపు ఇస్తారు. అంటే ఈ లెక్క ఎక్స్చేంజ్‌ ఫోన్ ధర పోగా, మోటో G06 పవర్ 5000 రూపాయలకు సొంతం చేసుకోవచ్చు. ఇది మీ పాత ఫోన్‌ కండిషన్ పై ఆధారపడి ఉంటుంది. దీపావళి నేపథ్యంలో ఈ ఆఫర్ ప్రకటించారు.






Next Story