- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kisan vikas pathra: రూ.1లక్ష పెడితే రూ.2 లక్షలు.. డబ్బులు రెట్టింపయ్యే ప్రభుత్వ పథకం
ప్రస్తుతం చాలా మంది డబ్బు సేవింగ్స్ కూడా దృష్టి పెడుతున్నారు. కెరీర్ ప్రారంభం నుండి ఎక్కడ సేవింగ్స్ చేస్తే ఎక్కువ మొత్తం చేతికి వస్తుంది అని ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు. అయితే కేంద్రం పేద, మధ్య తరగతి ప్రజలు డబ్బును రెట్టింపు చేసుకోవడానికి అనేక పథకాలను తీసుకువచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం చాలా మంది డబ్బు సేవింగ్స్ కూడా దృష్టి పెడుతున్నారు. కెరీర్ ప్రారంభం నుండి ఎక్కడ సేవింగ్స్ చేస్తే ఎక్కువ మొత్తం చేతికి వస్తుంది అని ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు. అయితే కేంద్రం పేద, మధ్య తరగతి ప్రజలు డబ్బును రెట్టింపు చేసుకోవడానికి అనేక పథకాలను తీసుకువచ్చింది. అలాంటి పథకాల్లో కిసాన్ వికాస్ పత్ర (Kisan vikas pathra) కూడా ముఖ్యమైనది. చాలా మందికి ఈ పథకం గురించి తెలియదు కానీ ఇందులో డబ్బులు పెట్టుబడిగా పెడితే రిటర్న్స్ రెట్టింపు వస్తాయి. ఇది ఒక పోస్ట్ ఆఫీస్ పథకం కాబట్టి ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. అయితే పథకం పేరులో కిసాన్ ఉండటంతో కేవలం రైతులకే ఈ పథకం అని అనుకుంటారు.
కానీ ఇందులో ఎవరైనా పొదుపు చేసుకోవచ్చు. కిసాన్ వికాస్ పత్రలో పెట్టుబడి పెడితే అది నిర్దిష్ట కాలంలో డబుల్ అవుతుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. మనం ఇప్పుడు పెట్టుబడి పెడితే ఆ డబ్బు 115 నెలల్లో అంటే దాదాపు 9 సంవత్సరాల 7 నెలల్లో రెట్టింపు అవుతుంది. ఈ పథకంపై ఏడాదికి 7.5శాతం వడ్డీ వస్తుంది. చక్రవడ్డీ కూడా లభించడంతో మీ పెట్టుబడి రెట్టింపు అవుతుంది. ఈ పథకంలో 18 సంవత్సరాలు ఆ పైబడిన భారతీయులు పెట్టుబడి పెట్టొచ్చు. తల్లిదండ్రులు తమ పిల్లలతో లేదా ఇద్దరు ముగ్గురు వ్యక్తులతో కలిసి ఉమ్మడి అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఈ పథకానికి అప్లై చేసుకోవాలి అంటే ముందుగా మీ గ్రామంలోని పోస్టాఫీస్ (post office)కి వెళ్లి కేవీపీ ఫారమ్ నింపాలి.
ఆధార్, పాన్ కార్డ్ మరియు కేవైసీ పత్రాలను సమర్పించి మీరు పెట్టుబడి ఎంత పెట్టాలని అనుకుంటున్నారో దానిని చెల్లించాలి. తరవాత మీకు కిసాన్ వికాస్ పత్ర సర్టిఫికెట్ ఇస్తారు. ఈ స్కీమ్ లో మీరు కనీసం రూ.1000 పెట్టవచ్చు, గరిష్టంగా ఎంతైనా పెట్టవచ్చు. డబ్బులు ఇన్వెస్ట్ చేసిన తరవాత మరణించినట్టు అయితే అవి నామినికి ట్రాన్ఫ్ ఫర్ చేసే అవకాశం ఉంది. ఈ స్కీమ్ లో కేవీపీ పత్రాలను బ్యాంకులో తాకట్టుపెట్టి లోన్ కూడా తీసుకునే అవకాశం ఉంది. అంతే కాకుండా మరొకరికి సైతం స్కీమ్ ను బదిలీ చేసే అవకాశం కూడా ఉంది. ఒకవేళ మీ డబ్బును రెట్టింపు చేసుకోవాలి అనుకుంటే ఈ పథకం మంచి ఆప్షన్.






