ఎండలకు ఫోన్ వేడెక్కుతోందా..? అయితే ఈ టిప్స్ పాటించండి

by velandi.Saikiran |

సమ్మర్ లో ఛార్జింగ్ పెట్టేటప్పుడు, మొబైల్స్ కవర్స్ కచ్చితంగా తొలగించాలని స్పష్టం చేస్తున్నారు.

ఎండలకు ఫోన్ వేడెక్కుతోందా..? అయితే ఈ టిప్స్ పాటించండి
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఎండలు దంచి కొడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో 45 డిగ్రీలకు పైగానే ప్రతిరోజు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉదయం 10 దాటిందంటే చాలు, ఎండ షురూ అవుతోంది. సాయంత్రం 6 గంటల వరకు ఈ తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో మధ్యాహ్నం పూట బయటకు రావాలంటేనే జనాలు వణికిపోతున్నారు. అయితే ఉష్ణోగ్రతల విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో మొబైల్స్ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ ఎండ తీవ్రతకు మొబైల్స్ కూడా చాలా హీట్ అవుతున్నాయి. అలా హీట్ కాకుండా కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమ్మర్ లో ఛార్జింగ్ పెట్టేటప్పుడు, మొబైల్స్ కవర్స్ కచ్చితంగా తొలగించాలని స్పష్టం చేస్తున్నారు.

ఇక ఎండలో ఉన్న‌ప్పుడు మొబైల్ లో గేమ్స్, వీడియోలు అస్సలు తీయకూడదట. ప్రయాణంలో ఉన్నప్పుడు కారు డ్యాష్ బోర్డు పైన మొబైల్ అస్సలు పెట్టకూడదని చెబుతున్నారు. కారు డ్యాష్ బోర్డుపైన మొబైల్స్ పెట్టడం వల్ల సన్ లైట్ నేరుగా దాని పైన పడుతుంది. అలా కూడా ఫోన్ వేడెక్కే ప్రమాదం ఉంది. ఈ సమ్మర్ లో జీపీఎస్, బ్లూటూత్, హాట్ స్పాట్ తక్కువగా వాడాలని చెబుతున్నారు. అవసరం ఉంటేనే వాడుకోవాలని సూచిస్తున్నారు. ఫోన్ బ్రైట్ నెస్ కూడా తక్కువగా పెట్టుకోవాలని చెబుతున్నారు. మొబైల్ వేడెక్కిందని నేరుగా ఫ్రిడ్జ్ లో అస్సలు పెట్టకూడదని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ మొబైల్ హీట్ అయిందని అనిపిస్తే.. పది నిమిషాల పాటు ఎయిర్ ప్లైన్ మోడ్ లో పెట్టుకోవాలని చెబుతున్నారు. ఈ టిప్స్ సమ్మర్ లో పాటిస్తే.. మొబైల్ అస్సలు వేడెక్కబోద‌ని సూచనలు చేస్తున్నారు.

Next Story