- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాట్సప్‌లో పనిచేయని Message Forward ఆప్షన్
ప్రస్తుతం ఇండియాలో 853.8 మిలియన్ల మంది ప్రజలు వాట్సప్ ను వినియోగిస్తున్నారు. వీరిలో అనేకమంది

దిశ, వెబ్‌డెస్క్: వాట్సప్.. ఇప్పుడు ఇది నూటికి 90 శాతం మందికి ప్రతిరోజూ వాడే టెక్నాలజీ వస్తువులా మారింది. చెప్పాలంటే మన జీవితంలో ఒక భాగమయింది. ఒకప్పుడు టెక్స్ట్ మెసేజులు చాలా లిమిటెడ్ గా ఉండేవి. కానీ వాట్సప్ అందుబాటులోకి వచ్చాక వాటితో పెద్దగా పని లేకుండా పోయింది. ఎవరికి ఏ మెసేజ్ పెట్టాలన్నా ముందుగా ఓపెన్ చేసేది ఈ యాప్ నే. ఆడియో, వీడియో కాల్స్, గ్రూప్ కాల్స్ కోసం కూడా ఈ యాప్ నే వాడుతున్నారు.
ప్రస్తుతం ఇండియాలో 853.8 మిలియన్ల మంది ప్రజలు వాట్సప్ ను వినియోగిస్తున్నారు. వీరిలో అనేకమంది ఉద్యోగులు కూడా ఉన్నారన్న విషయం తెలిసిందే. ఆఫీసుల్లో ప్రతీసారి మొబైల్ నుంచి మెసేజ్ చేయడం ఇబ్బంది కాబట్టి ఎక్కువగా వెబ్ వాట్సప్ ను వాడుతుంటారు. ఒక మెసేజ్ ను ఒకేసారి బల్క్ గా ఫార్వర్డ్ చేసే ఆప్షన్ వాట్సప్ లో ఉంటుంది. కానీ.. ఇప్పుడు ఆ ఆప్షన్ పనిచేయట్లేదు. మొబైల్ వెర్షన్ లో మెసేజ్ ఫార్వర్డ్ పనిచేస్తుంది కానీ.. వెబ్ వాట్సప్ లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఈ ఆప్షన్ పనిచేయలేదు. ఏదైనా టెక్నికల్ సమస్య వచ్చిందా ? లేక ఆ సంస్థ యాజమాన్యమే వెబ్ వాట్సప్ లో ఈ ఆప్షన్ ను ఆపేసిందా ? అని వినియోగదారులు ఆందోళన చెందారు. మధ్యాహ్నం నుంచి వాట్సప్ యాజమాన్యం ఈ ఆప్షన్ ను పునరుద్ధరించింది.






