స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? వీవోలో రూ.15 వేల లోపు బెస్ట్ ఫోన్లు మీకోసం!

by Yella Dhawani Reddy |   (  Updated:2025-05-20 07:05:08  IST  )

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ తప్పనిసరి అయిపోయింది.

స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? వీవోలో రూ.15 వేల లోపు బెస్ట్ ఫోన్లు మీకోసం!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ (Smartphone) తప్పనిసరి అయిపోయింది. చేతిలో ఫోన్ లేకపోతే చాలా మంది ఏదో కోల్పోయినట్లుగా ఫీలవుతుంటారు. అంతలా జనాలు స్మార్ట్ ఫోన్‌కు అడిక్ట్ అయిపోయారు. దీంతో స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు ప్రతి వారం కొత్త కొత్త మొబైల్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. అయితే తక్కువ ధరలో ఏది కొనాలా అని చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇక మధ్యతరగతి వారైతే బడ్జెట్‌ ధరలో అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ (Features) ఉండే ఫోన్ల కోసం చూస్తుంటారు. అలాంటి వారి కోసమే వివో (Vivo) రూ .15,000 లోపు సూపర్ స్మార్ట్ ఫోన్లను అందిస్తోంది. అవేంటో చూసేద్ధాం.

వివో వై 16 (Vivo Y16)

చైనాకు చెందిన వివో సంస్థ కస్టమర్ల కోసం బడ్జెట్ ఫోన్లను (Budget Phones) క్రమం తప్పకుండా రిలీజ్ చేస్తోంది. ఇందులో భాగంగా వివో వై16 ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో తక్కువ ధరలోనే బెస్ట్ ఫీచర్లను పరిచయం చేసింది. ఈ ఫోన్ 6.51 అంగుళాల HD+ స్క్రీన్, 5000mAh బ్యాటరీ, Helio P35 చిప్‌, డ్యుయల్ రియర్ కెమెరా సెటప్ వంటి ఫీచర్లతో వస్తుంది. కాల్స్, మెసేజ్‌లు, సాధారణ వాడకం కోసం ఇది సింపుల్ ఇంకా స్టైలిష్ ఎంపికగా చెప్పుకోవచ్చు. దీని ధర కూడా కేవలం రూ.9,999 మాత్రమే.

వివో వై17ఎస్ (Vivo Y17s)

పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు కంపెనీలు ఫోన్లు లాంచ్‌ చేస్తున్నాయి. ఇటీవల కాలంలో 5జీ వెర్షన్‌ ఫోన్లను కొనుగోలు చేయడానికి ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ నేఫథ్యంలోనే వివో వై17ఎస్ ఫోన్‌ను తీసుకొచ్చింది. అద్భుతమైన కెమెరా పనితీరు, మంచి బ్యాటరీ లైఫ్ కోసం చూస్తున్నవారికి ఇది పర్ఫెక్ట్ ఎంపిక. ఇక ఈ ఫోన్ 720×1612 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.56 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌వాటర్ డ్రాప్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్‌లో ఆక్టా-కోర్ మీడియా టెక్‌ హీలియో జీ 85 చిప్‌సెట్ ప్రాసెసర్, 50MP, 2MP డ్యూయల్ కెమెరాలతో పాటు ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా, 5000mAh బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకతలు. దీని ధర కేవలం రూ.10,499.

వివో టీ2ఎక్స్ 5జీ (Vivo T2x 5G)

ఈ ఫోన్ 6.58 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ IPS LCD డిస్‍ప్లేతో మార్కెట్‌లోకి ప్రవేశించింది. ఇందులో మీడియాటెక్ డైమన్సిటీ 6020 ప్రాసెసర్ ఉంది. 5000mAh బ్యాటరీతో ఈ ఫోన్ పనిచేస్తుంది. డ్యుయల్ సిమ్ 5జీ సపోర్టు, 4జీ ఎల్‍టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్‍బీ టైప్-సీ కనెక్టివిటీ ఫీచర్లుగా ఉన్నాయి. అల్ట్రా స్లిమ్ డిజైన్ దీని ప్రత్యేకత. దీని ధర కేవలం రూ.12,999.

Next Story