FACEBOOK: ఫేస్ బుక్ యూజర్లకు గుడ్ న్యూస్.. చాలా మందికి ఉపయోగపడే ఆ ఫీచర్ మళ్లీ వచ్చేసింది

by Ajay Maddhiboyina |   (  Updated:2025-10-14 10:38:32  IST  )

ఫేస్ బుక్ ఒకప్పుడు ప్ర‌పంచంలోనే ఎక్కువ మంది ఉప‌యోగించిన సోష‌ల్ మీడియా ప్లాట్ ఫామ్. ప్ర‌స్తుతం యూజ‌ర్లు త‌గ్గినా 40 ప్ల‌స్ వాళ్లు చాలా మంది ఈ యాప్ ప్ర‌తిరోజు వినియోగిస్తుంటారు.

FACEBOOK: ఫేస్ బుక్ యూజర్లకు గుడ్ న్యూస్.. చాలా మందికి ఉపయోగపడే ఆ ఫీచర్ మళ్లీ వచ్చేసింది
X

దిశ, వెబ్ డెస్క్: ఫేస్ బుక్ ఒకప్పుడు ప్ర‌పంచంలోనే ఎక్కువ మంది ఉప‌యోగించిన సోష‌ల్ మీడియా ప్లాట్ ఫామ్. ప్ర‌స్తుతం యూజ‌ర్లు త‌గ్గినా 40 ప్ల‌స్ వాళ్లు చాలా మంది ఈ యాప్ ప్ర‌తిరోజు వినియోగిస్తుంటారు. అయితే యూత్ మాత్రం దీని త‌ర‌వాత వ‌చ్చిన ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ ఎక్కువ‌గా వినియోగిస్తూ ఫేస్ బుక్‌లో అస‌లు అకౌంట్ కూడా ఓపెన్ చేయ‌డం లేదు. అయితే అలాంటి వారిని ఆక‌ర్షించేందుకు ఒక‌ప్పుడు ఉన్న లోక‌ల్ జాబ్స్ ఫీచ‌ర్‌‌ని మళ్లీ తీసుకువ‌చ్చింది.

ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా ప్రకారం ఈ ఫీచ‌ర్ ఉద్యోగం కోసం వెతికే వారికి, య‌జ‌మానుల‌కు ముఖ్యంగా స్థానికంగా ఉద్యోగాల‌ను వెతికేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. ఫేస్ బుక్ మెసెంజ‌ర్ ద్వారా ఉద్యోగ ఖాళీలు సెర్చ్ చేయ‌డం, ఆయా కంపెనీలు మ‌రియు సంస్థ‌ల‌కు సందేశాలు పంప‌డం లాంటివి చేయ‌వ‌చ్చు. మెసెంజ‌ర్ లోని మార్కెట్ ప్లేస్ ట్యాబ్ కు వెళ్లి ఉద్యోగాల‌ను ఎంచుకోవ‌చ్చు. ఎలాంటి ఉద్యోగం కావాలి, ఎంత దూరంలో ఉండాలి అనేది కూడా ఫిల్ట‌ర్ చేసుకోవ‌చ్చు. అంతే కాకుండా ఇందులో ఉద్యోగాలు ఓపెన్‌గా ఉంటాయ‌ని, ప‌బ్లిక్ గా క‌నిపిస్తాయ‌ని మెటా వెల్ల‌డించింది.

18 సంవ‌త్స‌రాలు నిండిన ప్ర‌తిఒక్క‌రికీ ఉద్యోగాల‌కు సంబంధించిన వివ‌రాలు క‌నిపిస్తాయ‌ని పేర్కొంది. సాధార‌ణంగా ఉద్యోగాలు వెతుక్కునేందుకు లింక్డ్ ఇన్ అనే యాప్ ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇందులో ఎక్కువ‌గా కార్పొరేట్ రేంజ్ ఉద్యోగాలు క‌నిపిస్తుంటాయి. కానీ స్థానికంగా ఉండే చిన్న చిన్న ఉద్యోగాల‌ను వెతికేందుకు స‌రైన ప్లాట్ ఫామ్ అందుబాటులో లేదు. దీంతో ఫేస్ బుక్ ఈ ఫీచ‌ర్ పై దృష్టిపెట్టింది. అయితే గ‌తంలోనూ ఈ ఫీచ‌ర్ ఉండగా త‌ర‌వాత తొల‌గించి ఇప్పుడు మ‌ళ్లీ తీసుకువ‌చ్చింది.

Next Story