- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Whatsapp update: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. పరిమిత సంఖ్యలోనే సందేశాలు!
వాట్సాప్ ఎప్పటికప్పుడు యూజర్ల కోసం కొత్త రూల్స్ తీసుకువస్తోంది. ఈ నేపథ్యంలోనే మరో కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఇప్పటి వరకు ఫోన్‌లో కాంటాక్ట్ నంబర్ లేకపోయినా అన్ లిమిటెడ్ సందేశాలు పంపించవచ్చు. కానీ ఇకపై అలా కాకుండా సందేశాలపై పరిమితి విధించబోతున్నట్టు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: వాట్సాప్ ఎప్పటికప్పుడు యూజర్ల కోసం కొత్త రూల్స్ తీసుకువస్తోంది. ఈ నేపథ్యంలోనే మరో కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఇప్పటి వరకు ఫోన్‌లో కాంటాక్ట్ నంబర్ లేకపోయినా అన్ లిమిటెడ్ సందేశాలు పంపించవచ్చు. కానీ ఇకపై అలా కాకుండా సందేశాలపై పరిమితి విధించబోతున్నట్టు తెలుస్తోంది. యూజర్ల ప్రైవసీని కాపాడటమే లక్ష్యంగా వాట్సాప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
వాట్సాప్ లో ప్రస్తుతం సాధారణ సందేశాలు పంపుకోవడంతో పాటు కమ్యూనిటీలు, బిజినెస్ అకౌంట్స్, కస్టమర్ సర్వీసెస్ లాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అయితే అలాంటి వాటి నుండి స్పామ్ మెసేజ్ లు రాకుండా కూడా ఈ ఫీచర్‌తో అరికట్టవచ్చని వాట్సాప్ భావిస్తోంది. కాంటాక్ట్ లిస్టులో లేని అకౌంట్ ద్వారా నెలకు మూడు సార్లు సందేశం పంపినప్పుడు అవతలి వారు స్పందించకపోతే మళ్లీ ఆ నంబర్‌కు మెసేజ్ పంపకుండా ఈ ఫీచర్ పనిచేస్తుందని సమాచారం.
అంతేకాకుండా మూడు సందేశాల తరవాత వారి మొత్తం మెసేజ్ ల కోటా నుండి వాటిని పంపిన వాటిని మైనస్ చేస్తారట. అయితే నెలకు ఎన్ని సందేశాలు పంపవచ్చు అనేదానిపై ఇంకా స్పష్టత రానట్టు తెలుస్తోంది. అంతే కాకుండా మొత్తం సందేశాల లిమిట్ కు దగ్గరవుతున్న సమయంలో ఓ అలర్ట్ కూడా వస్తుందట. ఇక పరిమితి దాటిన తరవాత అసలు సందేశాలు పంపకుండా తాత్కాలికంగా బ్రేక్ పడుతుందని సమాచారం. ఈ ఆప్షన్ అందుబాటులోకి వస్తే యూజర్లకు మాత్రం స్పామ్ మెసేజ్ ల నుండి ఎంతో విముక్తి లభిస్తుంది.






