- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
LIC గుడ్ న్యూస్.. నేటి నుండి తక్కువ ప్రీమియంతో రెండు కొత్త స్కీమ్స్ ప్రారంభం
ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మరో రెండు కొత్త పాలసీలను తీసుకువచ్చింది. జన సురక్ష, బీమా లక్ష్మి పేరుతో ఈ స్కీమ్స్ తీసుకురాగా నేటి నుండే వీటికి అప్లై చేసుకోవచ్చు. వీటిలో తక్కువ ఆదాయం ఉన్నవారి కోసం జర సురక్ష, మహిళల కోసం బీమా లక్ష్మి స్కీమ్స్ ఉన్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మరో రెండు కొత్త పాలసీలను తీసుకువచ్చింది. జన సురక్ష, బీమా లక్ష్మి పేరుతో ఈ స్కీమ్స్ తీసుకురాగా నేటి నుండే వీటికి అప్లై చేసుకోవచ్చు. వీటిలో తక్కువ ఆదాయం ఉన్నవారి కోసం జర సురక్ష, మహిళల కోసం బీమా లక్ష్మి స్కీమ్స్ ఉన్నాయి. పేద, మధ్య తరగతి ప్రజలకు బీమా కల్పించాలనే ఉద్దేశ్యంతో జన సురక్ష స్కీమ్ తీసుకువచ్చింది. ఇదినాన్ లింక్డ్, నాన్ ఇన్సూరెన్స్ స్కీమ్ మార్కెట్ లో వచ్చే లాభ నష్టాలతో దీనికి సంబంధం ఉండదు. ఇందులో ప్రిమియం తక్కువగా ఉంటుంది. ఈ స్కీమ్‌కు స్త్రీ, పురుషులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి అప్లై చేసుకుందుకు అర్హత వయస్సు 18 నుండి 55 ఏళ్ల మధ్య ఉండాలి.
పాలసీ టర్మ్ 12 నుండి 20 ఏళ్ల వరకు ఉంటుంది. ఇందులో రూ.1లక్ష నుండి రూ.2 లక్షల వరకు కవరేజ్ లభిస్తుంది. మెడికల్ అవసరాల కోసం ఈ పాలసీ పనిచేయదు. ఇక బీమా లక్ష్మి స్కీమ్‌ను కేవలం మహిళల కోసమే తీసుకువచ్చారు. ఇందులో బీమా మరియు పొదుపు రెండు కలిపి ఉంటాయి. దీనికి కూడా మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం ఉండదు. ఇందులో మూడు రకాల ఆప్షన్స్ ఉంటాయి. వాటిని బట్టి పాలసీని ఎంచుకోవచ్చు. పాలసీ వ్యవధి 25ఏళ్లు కాగా 7 నుండి 15ఏళ్ల వరకు చెల్లింపుల వ్యవధి ఎంచుకునే అవకాశం ఉంది. పాలసీ తీసుకునేందుకు కనీస వయసు 18ఏళ్లు కాగా గరిష్ఠ వయసు 50ఏళ్లుగా ఉంది.
ఇందులో కనీస బీమా రూ.2 లక్షలు కాగా గరిష్ఠంపై పరిమితి లేదు. ఇక ఈ పాలసీలో మూడు ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1, పాలసీ చెల్లింపు వ్యవధి పూర్తైన తరవాత 50 శాతం మొత్తాన్ని వెనక్కి ఇస్తారు. ఆప్షన్ 2, ప్రతి 2ఏళ్లకు హామీ మొత్తంలో నుండి 7.7శాతం చొప్పున 12 సార్లు చెల్లిస్తారు. ఆప్షన్ 3లో ప్రతి నాలుగేళ్లకు హామీ మొత్తంలో 15 శాతం చొప్పున 6సార్లు వెనక్కి తీసుకోవచ్చు. ప్రీమియం చెల్లింపుపై ఏడాదికి 7శాతం చొప్పున గ్యారెంటీడ్ అడిషన్ చేరుస్తారు. మెచ్యురిటీ సమయంలో బీమా హామీ మొత్తంతో కలిపి గ్యారెంటీడ్ అడిషన్‌ను చెల్లిస్తారు. అంతే కాకుండా పాలసీ మధ్యలో పాలసీదారుడికి ఏమైనా జరిగితే వార్షిక ప్రీమియంకు 10 రెట్లు లేదా బీమా హామీ మొత్తంలో ఏది ఎక్కువ ఉంటే అది చెల్లిస్తారు. ఇందులో వీలును బట్టి నెలకోసారి, త్రైమాసికానికి, ఆరు నెలలకు, ఏడాదికి వీలును బట్టి ప్రీమియం చెల్లింపు వ్యవధి ఎంచుకోవచ్చు.
Rapido: ర్యాపిడో యాప్‌లో విమాన, బస్సు, రైలు టికెట్ బుకింగ్ సౌకర్యం






