Lenovo నుంచి సరికొత్త ఆండ్రాయిడ్ Tab

by Disha Web Desk 17 |
Lenovo నుంచి సరికొత్త ఆండ్రాయిడ్ Tab
X

దిశ, వెబ్‌డె‌స్క్: Lenovo కంపెనీ ఇండియాలో సరికొత్త ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ను లాంచ్ చేసింది. దీని పేరు 'Tab M9'. ఇది జూన్ 1 నుంచి ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ స్టోర్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. దీని ప్రారంభ ధర రూ. 12,999. ట్యాబ్ ఫ్రాస్ట్ బ్లూ, స్టార్మ్ గ్రే కలర్స్‌లో లభిస్తుంది. Lenovo Tab M9 సరికొత్త MediaTek Helio G80 Octa-Core ప్రాసెసర్‌ ద్వారా పనిచేస్తుంది. Android 12 ఆపరేటింగ్ సిస్టమ్‌ ద్వారా రన్ అవుతుంది.




ఇది 9 అంగుళాల HD డిస్‌ప్లేను కలిగి ఉంది. గరిష్టంగా దీని మెమరీ 64GB. ట్యాబ్ చేతిలో పట్టుకోవడానికి సౌకర్యంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. వినియోగదారులకు మొబైల్ సినిమాటిక్ అనుభవాన్ని అందించడానికి ఇది సరిగ్గా సరిపోతుందని కంపెనీ పేర్కొంది. బ్యాటరీ పరంగా 13 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ టైం వస్తుందని, Netflix HD సపోర్ట్, ఫేషియల్ రికగ్నైజేషన్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లతో డాల్బీ అట్మోస్ స్పేషియల్ ఆడియో వంటి ఫీచర్స్‌తో లాంచ్ అవుతుందని కంపెనీ తెలిపింది.



Next Story