రూ.17 వేల ధరలో మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్ ఫోన్.. లాంచ్ తేదీ ఇదే!

by Disha Web |
రూ.17 వేల ధరలో మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్ ఫోన్.. లాంచ్ తేదీ ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: iQoo కంపెనీ నుంచి కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్ ‘iQoo Z7 5G’ మార్చి 21 న కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. 6GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ. 18,999. 8GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ. 19,999. లాంచ్ ఆఫర్‌లో భాగంగా బేస్ వేరియంట్ రూ. 17,499 కే లభిస్తుంది. ఈ కామర్స్ సైట్ అమెజాన్, iQoo ఇ-స్టోర్ ద్వారా మార్చి 21న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుంది. అదే రోజు మధ్యాహ్నం 1 గంటలకు అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.


iQoo Z7 5G స్పెసిఫికేషన్లు

* 6.38-అంగుళాల పూర్తి-HD+ AMOLED డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్.

* ఫోన్ MediaTek Dimensity 920 5G SoC ద్వారా పనిచేస్తుంది.

* ఆండ్రాయిడ్ 13, Funtouch OS 13 పై రన్ అవుతుంది.

* ఫోన్ బ్యాక్ సైడ్ 64MP+8MP డ్యూయల్ కెమోరా.

* ముందు సెల్ఫీల కోసం 16MP కెమెరా ఉంది.

* 44W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో కేవలం 25 నిమిషాల్లో 50 శాతం వరకు ఫోన్‌ను చార్జ్‌ చేస్తుంది.

ఇవి కూడా చదవండి : TikTok కు మరో దెబ్బ..

Next Story