- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
iQOO Neo 11: 7500mah బ్యాటరీతో కొత్త iQOO ఫోన్ వచ్చేస్తోంది..ధర ఎంతంటే ?
ఐక్యూ నియో 11 ( iQOO Neo 11) పేరుతో మరో మొబైల్ ఇండియాలో లాంచ్ కాబోతుందట. అయితే ఈ ఫోన్ రావడానికి కాస్త సమయం పడుతుంది. మార్చి లేదా ఏప్రిల్ మాసాలలో ఈ మొబైల్ ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ మార్కెట్లోకి అనేక రకాల ఫోన్స్ వస్తున్నాయి. ఇందులో తక్కువ ధర, ఎక్కువ ధరతో పాటు మంచి ఫీచర్స్ ఉన్న ఫోన్లు కూడా ఉంటాయి. ఇక మరికొన్ని మొబైల్స్ అయితే సామాన్యులు కొనుగోలు చేసేలా, అన్ని ఫీచర్స్ తో కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇండియావ్యాప్తంగా ఐక్యూ ఫోన్లకు డిమాండ్ పెరిగింది. చాలా మంది కెమెరా క్వాలిటీ కోసం ఈ ఐక్యూ ఫోన్స్ కొనుగోలు చేస్తున్నారు.
ఇలాంటి నేపథ్యంలోనే ఈ కంపెనీ నుంచి తాజాగా కీలక ప్రకటన వచ్చింది. ఐక్యూ నియో 11 ( iQOO Neo 11) పేరుతో మరో మొబైల్ ఇండియాలో లాంచ్ కాబోతుందట. అయితే ఈ ఫోన్ రావడానికి కాస్త సమయం పడుతుంది. మార్చి లేదా ఏప్రిల్ మాసాలలో ఈ మొబైల్ ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే చైనాలో ఈ ఫోన్ లాంచ్ అయ్యి, విపరీతమైన సేల్స్ సాధిస్తోంది. మరి అలాంటి ఈ iQOO Neo 11 ఫోన్ ఫీచర్స్ ఒకసారి పరిశీలిద్దాం.
iQOO Neo 11 ఫీచర్స్, ధర ఎంత అంటే ?
6.82 అంగుళాల డిస్ ప్లేతో వస్తోన్న iQOO Neo 11 ఫోన్ Snapdragon 8 Elite కలిగి ఉంటుంది. అలాగే, 50MP (Main) + 8MP (UW) ప్రధాన కెమెరా ఈ ఫోన్ కు రానుంది. సెల్ఫీల కోసం 16 MP ఫ్రంట్ కెమెరా అందిస్తున్నారు. 7500 mAh బ్యాటరీ అందించనున్నారు. 100W వైర్డ్ ఛార్జర్ సపోర్ట్ చేయనుంది. 12GB+256GB వేరియంట్ ధర రూ. 32,400 గా ఉండే ఛాన్స్ ఉంది. అయితే ఇండియాలో iQOO Neo 11 పేరుతో కాకుండా iQOO 15R ఈ ఫోన్ తీసుకువచ్చే ఛాన్స్ ఉందట.






