ఐఫోన్ 18 ప్రో వివరాలు లీక్.. ధర ఎంతంటే?

by velandi.Saikiran |

ఐఫోన్ 18 ప్రో మొబైల్ ( iPhone 18 Pro ) వివరాల కోసం చాలామంది ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఫోన్ వివరాలు తాజాగా లీక్ అయినట్లు తెలుస్తోంది.

ఐఫోన్ 18 ప్రో వివరాలు లీక్.. ధర ఎంతంటే?
X

దిశ, వెబ్ డెస్క్‌: మన ఇండియన్ మార్కెట్లో మొబైల్స్ కు ఉన్న గిరాకీ ఏ వస్తువులకు లేదు. ప్రతి వ్యక్తి రెండు లేదా అంతకంటే ఎక్కువ మొబైల్స్ వాడుతున్నారు. ఆఫీస్ కోసం ఒక ఫోను... పర్సనల్ కోసం మరో ఫోన్ వాడేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే కంపెనీలు రకరకాల మొబైల్స్ తీసుకువస్తున్నాయి. అంతేకాదు, ఇప్పుడు ఆఫీస్ బాయ్ కూడా ఐఫోన్ వాడేస్తున్నాడు. ఐఫోన్ ఉంటేనే మనిషి బతుకుతాడు అన్న రేంజ్ లో పరిస్థితి తయారయింది.

అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఐఫోన్ కు సంబంధించిన మరో కొత్త ఫోన్ వివరాలు వైరల్ గా మారాయి. ఐఫోన్ 18 ప్రో మొబైల్ ( iPhone 18 Pro ) వివరాల కోసం చాలామంది ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఫోన్ వివరాలు తాజాగా లీక్ అయినట్లు తెలుస్తోంది. ఐఫోన్ 18 ప్రో, ప్రో మాక్స్ డైనమిక్ ఐలాండ్ తో కాకుండా అండర్ డిస్ ప్లే ఏరియాతో రాబోతున్నట్లు సమాచారం.

ఇక కొత్తగా 2ఎన్ఎం టెక్నాలజీతో తయారైన A 20 ప్రో చిప్ తో పాటు కెమెరాలు మెకానికల్ ఐరిస్ లాంటి ఫీచర్లు కూడా ఉండబోతున్నట్లు సమాచారం. ఇండియాలో ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో ఈ మొబైల్ లాంచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐఫోన్ 18 ప్రో మొబైల్ ద్వారా రూ. 1,34,900 రూపాయలుగా ఉండే ఛాన్స్ ఉంది. ప్రో మాక్స్ మొబైల్ ధర రూ.1,49, 900 రూపాయలుగా ఉండే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

Next Story