నేటి నుండే IPHONE 17 ప్రీ బుకింగ్స్.. ఇలా ఆర్డర్ చేసుకోండి!

by Ajay Maddhiboyina |

ఆపిల్ ల‌వ‌ర్స్ ఎంత‌గానో ఎదురుచూస్తున్న ఐఫోన్ 17 ప్రీబుకింగ్స్ నేటి నుండే ప్రారంభం అయ్యాయి. ఐఫోన్ 17లో మొత్తం మూడు మోడ‌ల్స్ ఉన్నాయి. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ఎయిర్ మోడ‌ల్ ఉన్నాయి.

నేటి నుండే IPHONE 17 ప్రీ బుకింగ్స్.. ఇలా ఆర్డర్ చేసుకోండి!
X

దిశ‌, వెబ్ డెస్క్: ఆపిల్ ల‌వ‌ర్స్ ఎంత‌గానో ఎదురుచూస్తున్న ఐఫోన్ 17 (IPHONE 17) ప్రీబుకింగ్స్ నేటి నుండే ప్రారంభం అయ్యాయి. ఐఫోన్ 17లో మొత్తం మూడు మోడ‌ల్స్ ఉన్నాయి. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో (IPHONE 17 PRO), ఐఫోన్ 17 ఎయిర్ (IPHONE 17 AIR) మోడ‌ల్స్ ఉన్నాయి. కాగా నేటి నుండి ఈ మోడ‌ల్స్‌కు ఆపిల్ ప్రీ బుకింగ్స్ ప్రారంభించింది. వచ్చే వారం నుండి ఇవి అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. ఐఫోన్ 17లో కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చాయి. వీటిలో బేస్ మోడల్‌లో 120 హెచ్‌జడ్ డిస్ ప్లే, ఐఫోన్ 16 కంటే సన్నని డిజైన్, A19 ప్రో చిప్‌సెట్‌తో సరికొత్తగా కనిపించనుంది.

మీరు ఈ ఫోన్‌ను సాయంత్రం 5:30 గంటల నుండి యాపిల్ ఆన్ లైన్ స్టోర్ లేదా ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లాంటి ప్లాట్ ఫామ్‌ల ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. ఆపిల్ ఆన్లైన్ స్టోర్ నుండి ఫోన్ బుక్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా ఆపిల్ వెబ్ సైట్ ఓపెన్ చేయండి. తరవాత మీకు కావాల్సిన ఐఫోన్ 17 మోడల్ ఎంపిక చేసుకోండి. మీకు కావాల్సిన కలర్ ఎంచుకుని బుకింగ్ పూర్తి చేయడానికి దానిని కార్ట్ లోకి వెళ్లండి. తరవాత చెక్ అవుట్ పై క్లిక్ చేసి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా యూపీఐ ద్వారా పేమెంట్ చేయండి. బుకింగ్ కన్ఫామ్ అయిన తరవాత డెలివరీకి సంబంధించిన వివరాలు మీ ఫోన్ కు మెసేజ్ ద్వారా వస్తాయి మరియు సైట్‌లో సైతం కనిపిస్తాయి.

Next Story