- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇవాళే యాపిల్ ఈవెంట్.. ఐఫోన్ 17 కొత్త సిరీస్ మొబైల్స్ లాంచింగ్.. ధరలు ఎంతంటే
ఐఫోన్ ప్రేమికులకు అదిరిపోయే శుభవార్త అందింది. ఇవాళ యాపిల్ కంపెనీ ప్రత్యేక ఈవెంట్ నిర్వహిస్తోంది. యాపిల్ ఈవెంట్

దిశ, వెబ్ డెస్క్ : ఐఫోన్ ప్రేమికులకు అదిరిపోయే శుభవార్త అందింది. ఇవాళ యాపిల్ కంపెనీ ప్రత్యేక ఈవెంట్ నిర్వహిస్తోంది. యాపిల్ ఈవెంట్ పేరుతో... ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. ఈ యాపిల్ ఈవెంట్... భారత కాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్ ను యాపిల్ వెబ్ సైట్ లేదా ఛానల్ లో లైవ్ మనం చూడవచ్చు.
ఈ ఈవెంట్ నేపథ్యంలో... ఐఫోన్ సిరీస్ 17 (Apple iPhone 17 ), ఆపిల్ వాచ్ సిరీస్ 11, ఎయిర్ పాడ్స్ 3తో పాటు మరికొన్ని ఉత్పత్తులను లాంచ్ చేయబోతోంది కంపెనీ. ముఖ్యంగా యాపిల్ కంపెనీ... ఈ ఈవెంట్ లో ఐఫోన్ 17 బిగ్ డిస్ప్లే, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ పేర్లతో నాలుగు కొత్త మొబైల్స్ తీసుకువచ్చే ఛాన్స్ ఉంది. ఇందులో ఐఫోన్ 17 ఎయిర్ చాలా ప్రత్యేకమైనదని తెలుస్తోంది.
ఈ ఫోన్ 5.5 MM మందం మాత్రమే ఉంటుంది. 6.6 అంగుళాల డిస్ప్లే అందిస్తున్నారు. ఈ మొబైల్ ప్రారంభ ధర 900 డాలర్లు ఉండే ఛాన్స్ లో ఉన్నట్లు చెబుతున్నారు. బేస్ మాడల్ ఐఫోన్ 17 డిస్ప్లే సైజును 6.1 నుంచి 6.3 అంగుళాలకు పెంచేశారు. ఈ మొబైల్ ధర ఎనిమిది వందల డాలర్లు ఉండే ఛాన్స్ లు ఉన్నాయి. ఐఫోన్ 17 ప్రో ధర 1099 డాలర్లు, ఐఫోన్ ప్రో మాక్స్ ధర 1199 డాలర్లు ఉండే ఛాన్స్ ఉంది.






