అదిరిపోయే ఫీచర్లతో iPhone 16

by Disha Web Desk 17 |
అదిరిపోయే ఫీచర్లతో iPhone 16
X

దిశ, వెబ్‌డెస్క్: యాపిల్ కంపెనీ నుంచి త్వరలో iPhone 15 సిరీస్ ప్రపంచ మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ మోడల్ తర్వాత వరుసలో iPhone 16 సిరీస్ రాబోతుందని సమాచారం. ఇటీవల వస్తున్న నివేదికల ప్రకారం, iPhone 16 సిరీస్‌లో హై-ఎండ్ కెమెరా సెన్సార్‌‌లను ఉపయోగించనున్నారు. ఇవి వెలుతురు తక్కువ ఉన్న ప్రదేశాల్లో కూడా అత్యంత క్లారిటీతో ఫొటోలు, వీడియోలను తీయగలవు.

ఇప్పటికే మరికొద్ది రోజుల్లో రాబోతున్న iPhone 15 సిరీస్‌లో 48-మెగాపిక్సెల్ వెనుక కెమెరాల కోసం CMOS ఇమేజ్ సెన్సార్‌లను అందిస్తామని గతంలో పేర్కొనగా, వచ్చే ఏడాది రానున్న 16 సిరీస్‌లో ఇంకా మంచి కెమెరాలను వాడనున్నారని TF ఇంటర్నేషనల్ సెక్యూరిటీస్ అనలిస్ట్ మింగ్-చి కువో శుక్రవారం ఒక బ్లాగ్‌పోస్ట్‌లో పేర్కొన్నారు.

సాధారణంగా యాపిల్ ఫోన్లకు సోనీ కంపెనీ కెమెరాలను సరఫరా చేస్తుంది, అయితే సరఫరా ఆందోళనల కారణంగా యాపిల్ కంపెనీ కెమెరాల కొరతను ఎదుర్కొంటుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి యాపిల్ కంపెనీ వేరే మార్గాలను కూడా అన్వేషిస్తుంది.

నిపుణులు పేర్కొన్న దాని ప్రకారం, iPhone 16 సిరీస్‌లో కొత్త బ్యాటరీ సాంకేతికతను ఉపయోగించనున్నారని తెలుస్తోంది. పాత వాటితో పోలిస్తే దీనిలో 40W వైర్డు, 20W MagSafe వైర్‌లెస్ చార్జింగ్‌ను తీసుకురావచ్చిని నివేదికలు పేర్కొన్నాయి. దీంతో పాటు మరిన్ని అధునాతన కొత్త ఫీచర్లను iPhone 16లో ఇవ్వనున్నారు.

Next Story

Most Viewed