భారీ గుడ్ న్యూస్.. మళ్లీ కలవబోతున్న సమంత, నాగచైతన్య.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్!

by Hamsa |
భారీ గుడ్ న్యూస్.. మళ్లీ కలవబోతున్న సమంత, నాగచైతన్య.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఏవో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక అప్పటి నుంచి ఎవరి లైఫ్ వారు చూసుకుంటున్నారు. అయితే వీరి ఫ్యాన్స్ మాత్రం మళ్లీ సమంత, నాగచైతన్య కలిస్తే చూడాలని ఉందంటూ సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతున్నారు. అయితే ఇన్నాళ్లకు అభిమానుల కోరిక తీరబోతున్నట్లు తెలుస్తోంది. సమంత, నాగచైతన్య ఓ స్పెషల్ ఈవెంట్‌లో కలవబోతున్నారని టాక్. విడాకులు తీసుకున్న తర్వాత ఒకే చోట కలవడం గమనార్హం. మనం సినిమా రీరిలీజ్ ఈవెంట్‌కు అక్కినేని ఫ్యామిలీతో పాటు, సమంత కూడా హాజరు కానున్నట్లు సమాచారం.

అసలు విషయంలోకి వెళితే.. విక్రమ్ కుమార్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమా ‘మనం’. ఇందులో నాగేశ్వర రావు, కింగ్ నాగార్జున, నాగచైతన్య, అఖిల్, సమంత, శ్రియ శరణ్, అమల, కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. అయితే 2014లో విడుదలైన మనం చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించింది. తెలుగు ప్రేక్షకులను మెప్పించిన క్లాసిక్ మూవీగా అందరి మనసులో నిలిచిపోయింది. అయితే ఈ సినిమా విడుదలై ఏకంగా 10 ఏళ్లు పూర్తయింది. దీంతో మేకర్స్ మే 23న రెండు తెలుగు రాష్ట్రాల్లో మనం స్పెషల్ షోలను ఏర్పాటు చేశారు. ఈ విషయంపై అన్నపూర్ణ స్టూడియోస్ సోషల్ మీడియా ద్వారా అధికారిక ప్రకటనను కూడా విడుదల చేసింది.

అయితే అక్కినేని ఫ్యామిలీకి మనం సినిమా ఎంత స్పెషల్ అనేది అందరికీ తెలిసిందే. పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ ఈవెంట్‌ను కూడా అక్కినేని ఫ్యామిలీ నిర్వహించనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనికి ఈ సినిమాలో నటించిన నటీనటులంతా హాజరుకానున్నారు. అయితే మనంలో సమంత, నాగచైతన్య జంటగా నటించారు కాబట్టి అక్కినేని ఫ్యామిలీ ఆమెను కూడా పిలిచినట్లు సమాచారం. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ మాత్రం ఇన్నాళ్లకు మళ్లీ సమంత, నాగచైతన్యను ఒకే చోట చూసే అదృష్టం రాబోతుందంటూ చర్చించుకుంటున్నారు.

Next Story