- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్...భారీగా పడిపోయిన 16 మోడల్ ధర
ఐఫోన్ కొనుగోలు చేసే వారికి అదిరిపోయే శుభవార్త. భారీగా ఐఫోన్ 16 ధరలు తగ్గాయి. కొనుగోలు చేసేవారు ఇప్పుడే కొనేయండి. దాదాపు

దిశ, వెబ్ డెస్క్ : ఐఫోన్ కొనుగోలు చేసే వారికి అదిరిపోయే శుభవార్త. భారీగా ఐఫోన్ 16 ధరలు తగ్గాయి. కొనుగోలు చేసేవారు ఇప్పుడే కొనేయండి. దాదాపు పదివేల వరకు డిస్కౌంట్ ప్రకటించింది కంపెనీ. Awe Droping పేరుతో.. యాపిల్ ఇవాళ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఐఫోన్ 17 సిరీస్ మొబైల్ ఫోన్స్ రిలీజ్ చేస్తోంది. వీటితో పాటు స్మార్ట్ వాచ్లు, ఇయర్ బర్డ్స్ కూడా తీసుకువస్తోంది.
అయితే ఈ నేపథ్యంలోనే.. ఐఫోన్ 16 పై కీలక ప్రకటన చేసింది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ఈ కామర్స్ లో మాత్రమే ఈ మొబైల్ పై డిస్కౌంట్ అందిస్తున్నారు. అమెజాన్ లో ఐఫోన్ 16 బేస్ వేరియంట్ మొబైల్ ధర అమెజాన్ లో రూ. 69, 999 ధరకు లభిస్తోంది. వాస్తవానికి ఈ మొబైల్ ను 79,999 ధరకు ప్రారంభించింది కంపెనీ. కానీ ఇప్పుడు ఈ మొబైల్ ను...రూ. 69, 999 ధరకు ఫిక్స్ చేసారు. అంటే అమెజాన్ లో కొనుగోలు చేస్తే దాదాపు పదివేల డిస్కౌంట్ లభిస్తుంది. ఎక్స్చేంజ్ ఆఫర్లు, క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్లు అన్ని పోగా ఈ మొబైల్ చివరికి 60 వేల వరకు వచ్చే ఛాన్స్ లు ఉంటాయి.
ఇక ఫ్లిప్ కార్ట్ లో ఈ మొబైల్ ధర రూ. 74,900కు అందుబాటులో ఉంటుంది. 128gb +8gb స్టోరేజ్ కలిగి ఉంటుంది ఈ మొబైల్. అంటే దాదాపు నేరుగా ఐదు శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. అలాగే ఇతర క్రెడిట్ కార్డులు, ఎక్స్చేంజ్ ఆఫర్లు అమలు చేస్తే మొబైల్ ద్వారా ఇంకా తగ్గుతుంది. కాగా ఆపిల్ ఈవెంట్ 2025 లో ఇవాళ ఐఫోన్ 17, 17 ఎయిర్, 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్ లాంచ్ చేస్తున్నారట.






