ఇన్‌స్టా‌గ్రామ్‌‌ వాడేవారికి అల‌ర్ట్‌..అమ‌లులోకి కొత్త రూల్ !

by velandi.Saikiran |

జనరల్ హ్యాష్ ట్యాగ్స్‌ కాకుండా టార్గెటెడ్ హ్యాష్ ట్యాగ్స్‌ మాత్రమే వాడితే మంచి ప్రయోజనం

ఇన్‌స్టా‌గ్రామ్‌‌ వాడేవారికి అల‌ర్ట్‌..అమ‌లులోకి కొత్త రూల్ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఇన్‌స్టా‌గ్రామ్ వాడే వాళ్లకు బిగ్ అలర్ట్. తాజాగా కొత్త రూల్స్ తీసుకువచ్చింది ఇన్‌స్టా‌గ్రామ్‌‌. హ్యాష్ టాగ్ ల వినియోగంపై కొత్తగా పరిమితి విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపై రీల్స్, లేదా పోస్టు పెట్టేట‌ప్పుడు పరిమితికి మించి హ్యాష్ ట్యాగ్స్‌ వినియోగించకూడదని సూచనలు చేసింది ఇన్‌స్టా‌గ్రామ్‌‌. పోస్ట్ లేదా రీల్ అప్లోడ్ చేసినప్పుడు గరిష్టంగా కేవలం 5 హ్యాష్ ట్యాగ్స్‌ మాత్రమే వినియోగించేలా రూల్స్ పెట్టింది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెల్లడించింది.

జనరల్ హ్యాష్ ట్యాగ్స్‌ కాకుండా టార్గెటెడ్ హ్యాష్ ట్యాగ్స్‌ మాత్రమే వాడితే మంచి ప్రయోజనం ఉంటుందని కూడా వెల్లడించింది. అనవసర హ్యాష్ ట్యాగ్స్‌ వాడకుండా ఆ కంటెంట్ కు సంబంధించిన వాటిని మాత్రమే వాడాలని పేర్కొంది. 2011లో హ్యాష్ ట్యాగ్స్‌ ప్రవేశపెట్టింది ఇన్‌స్టా‌గ్రామ్‌‌. అప్పటి నుంచి ఎడాపెడా హ్యాష్ ట్యాగ్స్‌ వాడేస్తున్నారు కంటెంట్ క్రియేటర్లు. ఒక పోస్టుకు 30 హ్యాష్ ట్యాగ్స్‌ కూడా జోడించే అవకాశం కల్పించింది. అయితే ఇప్పుడు దానిపై పరిమితి విధిస్తూ కేవలం 5 మాత్రమే వినియోగించేలా రూల్స్ పెట్టింది ఇన్‌స్టా‌గ్రామ్‌‌.

Next Story