Flipkart‌లో అమ్మకానికి వచ్చిన Infinix కొత్త స్మార్ట్ ఫోన్స్

by Disha Web Desk 17 |
Flipkart‌లో అమ్మకానికి వచ్చిన Infinix కొత్త స్మార్ట్ ఫోన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: Infinix కంపెనీ నుంచి ఇటీవల మార్కెట్లోకి విడుదలైన రెండు కొత్త స్మార్ట్ ఫోన్ వేరియంట్లు ప్రస్తుతం అమ్మకానికి వచ్చాయి. ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. ఈ మోడళ్లు Flipkart వెనిలా Infinix Zero 5G 2023, Infinix Zero 5G 2023 Turbo ఎడిషన్‌. Flipkart వెనిలా Infinix Zero 5G 2023 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్‌ ధర రూ. 17,999. Infinix Zero 5G 2023 Turbo, 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 19,999.


రెండు వేరియంట్లు కూడా 6.78-అంగుళాల పూర్తి-HD+ (1,080x2,460 పిక్సెల్‌లు) డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉన్నాయి. ఆండ్రాయిడ్ 12-ఆధారిత XOSలో రన్ అవుతాయి. Infinix Zero 5G 2023, MediaTek డైమెన్సిటీ 920 5G SoC ద్వారా పనిచేస్తే, అదే Infinix Zero 5G 2023 Turbo.. MediaTek డైమెన్సిటీ 1080 5G SoCని ద్వారా పనిచేస్తుంది. రెండింటిలో కూడా బ్యాక్ సైడ్ 50MP+2MP+2MP కెమెరాలు ఉన్నాయి. సెల్పీల కోసం 16MP కెమెరా ఉంది. అలాగే, 33W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీను కూడా అందించారు.



Next Story

Most Viewed