హై ఎండ్ ఫీచర్స్.. కానీ ధర మాత్రం రూ. 5 వేలే..! Infinix కొత్త స్మార్ట్‌ఫోన్

by Disha Web Desk 17 |
హై ఎండ్ ఫీచర్స్.. కానీ ధర మాత్రం రూ. 5 వేలే..! Infinix కొత్త స్మార్ట్‌ఫోన్
X

దిశ, వెబ్‌డెస్క్: Infinix కంపెనీ సామాన్య మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని కొత్తగా అతి తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్‌ను ఇండియాలో విడుదల చేసింది. ఈ మోడల్ పేరు ‘Infinix Smart 7HD’. ప్రస్తుతం ఇది కొనుగోలుకు అందుబాటులో ఉంది. దీని ధర రూ. 5,399. ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఇంక్ బ్లాక్, సిల్క్ బ్లూ, జేడ్ వైట్, గ్రీన్ ఆపిల్ కలర్స్‌లలో ఫోన్ లభిస్తుంది. Infinix Smart 7HD స్మార్ట్‌ఫోన్ 6.6-అంగుళాల పూర్తి HD+ రిజల్యూషన్, 500 NITS ప్రకాశంతో వస్తుంది. Android 12 Goతో రన్ అవుతుంది. 2GB RAM, 64GB మెమరీతో, బ్యాక్ సైడ్ 8MP డ్యూయల్ AI కెమెరా, 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.


దీనిలో 5000mAh బ్యాటరీ ఉంది. ఇది దాదాపు 50 గంటల మ్యూజిక్, దాదాపు 39 గంటల కాలింగ్, 30 రోజుల స్టాండ్-బై టైమ్‌ని అందజేస్తుందని కంపెనీ పేర్కొంది. ఫోన్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లను కూడా అందించారు.



Next Story

Most Viewed