రూ. 8 వేల ధరలో 8GB RAM.. మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్

by Disha Web Desk 17 |
రూ. 8 వేల ధరలో 8GB RAM.. మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్
X

దిశ, వెబ్‌డెస్క్: Infinix కంపెనీ ఇండియాలో కొత్తగా స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీని పేరు ‘Infinix Hot 30i’. దీని 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,999. ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్డ్ ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఫోన్ మిర్రర్ బ్లాక్, గ్లేసియర్ బ్లూ కలర్స్‌లలో లభిస్తుంది. ఇది ఒక్కసారి చార్జింగ్‌పై 30 రోజుల వరకు స్టాండ్‌బై టైంను అందిస్తుందని కంపెనీ పేర్కొంది.


Infinix Hot 30i స్పెసిఫికేషన్‌లు

* 6.6 అంగుళాల HD+ IPS LCD ప్యానెల్‌,

* 90Hz రిఫ్రెష్ రేట్, పాండా గ్లాస్ ప్రొటక్షన్

* Android 12 OS ఆధారిత XOS 12 కస్టమ్ స్కిన్‌తో నడుస్తుంది.

* MediaTek Helio G37 SoC ద్వారా రన్ అవుతుంది.


* ఫోన్ బ్యాక్‌సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ

* సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

* 10W చార్జింగ్‌ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ కలిగి ఉంది.

Next Story

Most Viewed