6500mAh బ్యాట‌రీతో ఇన్ఫినిక్స్ ఫోన్‌..ధ‌ర‌, ఫీచ‌ర్స్ ఇవే

by velandi.Saikiran |

ఇన్ఫినిక్స్ GT 50 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. గేమింగ్ ప్రియులను దృష్టిలో పెట్టుకొని ఈ ఫోన్ తీసుకువచ్చారు.

6500mAh బ్యాట‌రీతో ఇన్ఫినిక్స్ ఫోన్‌..ధ‌ర‌, ఫీచ‌ర్స్ ఇవే
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇండియాలో అనేక రకాల ఫోన్లు లాంచ్ అవుతున్నాయి ఉన్నాయి. తక్కువ ధరలో మిడిల్ క్లాస్ వాళ్లను ఆకట్టుకునేలా వస్తున్న ఫోన్లకు గిరాకీ బాగానే ఉంది. దానికి తగ్గట్టుగానే కంపెనీలు కూడా మొబైల్స్ లాంచ్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఇన్ఫినిక్స్ GT 50 ప్రో ( Infinix GT 50 Pro) స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. గేమింగ్ ప్రియులను దృష్టిలో పెట్టుకొని ఈ ఫోన్ తీసుకువచ్చారు.

6.78 అంగుళాల డిస్ ప్లే ఈ ఫోన్ లాంచ్ అయింది. 6500 mah బ్యాటరీ సామర్థ్యంతో వచ్చిన ఈ ఫోన్ కు 45W ఫాస్ట్ ఛార్జర్ మాత్రమే సపోర్ట్ చేయనుంది. మెయిన్ కెమెరా 50 ఎంపీ కాగా, సెల్ఫీల కోసం 13 MP అందిస్తున్నారు. మీడియా టెక్ డైమెన్సిటీ 8400 అల్టిమేట్ చిప్ సెట్ అందిస్తున్నారు. ఇక 12GB +256GB మోడల్ మొబైల్ ధర రూ.35,000గా ఫిక్స్ చేశారు. 12GB + 512GB మోడల్ మొబైల్ ధర రూ.40,000గా ఫిక్స్ చేశారు.

Next Story