గ్రోక్‌లో సరికొత్త ఆప్షన్.. ఇమేజ్‌ ఇచ్చిన క్షణాల్లోనే ఇలా వీడియోగా మార్చండి

by Ajay Maddhiboyina |

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్‌లో ఇప్పుడు సరికొత్త ఆప్షన్ వచ్చింది. ఎక్స్‌లో ఎఐ సపోర్ట్ కోసం గ్రోక్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. గ్రోక్ ఏఐ ద్వారా అనేక ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవచ్చు.

గ్రోక్‌లో సరికొత్త ఆప్షన్.. ఇమేజ్‌ ఇచ్చిన క్షణాల్లోనే ఇలా వీడియోగా మార్చండి
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్‌లో ఇప్పుడు సరికొత్త ఆప్షన్ వచ్చింది. ఎక్స్‌లో ఎఐ సపోర్ట్ కోసం గ్రోక్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. గ్రోక్ ఏఐ ద్వారా అనేక ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. ఏదైనా డౌట్ వచ్చిందంటే ఏ భాషలో అడిగినా దానికి గ్రోక్ సమాచారాన్ని అందిస్తుంది. కొన్ని వెబ్ సైట్ లలో వచ్చిన సమాచారాన్ని విశ్లేషించి మనకు కావాల్సిన సమాచారం ఇస్తుంది. అంతే కాకుండా బోల్డ్‌గా ఆన్సర్లు ఇవ్వడంతో గ్రోక్ ఎంతో పాపులర్ అయ్యింది. అయితే ఇమేజ్ క్రియేషన్ లో మాత్రం గ్రోక్ ఇప్పటి వరకు ఇతర ఏఐ చాట్ బాట్‌లతో పోటీ పడలేకపోయింది.

కానీ తాజాగా ఓ అద్భుతమైన ఫీచర్ తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా మీరు ఇమేజ్ అప్ లోడ్ చేసిన సెకన్లలోనే దానిని వీడియోగా మారుస్తుంది. దీని కోసం ఎలాంటి ప్రాంప్ట్‌లు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. గ్రోక్ వెబ్ సైట్ ద్వారా, గ్రోక్ యాప్ ద్వారా దీనిని వినియోగించవచ్చు. యాప్‌లో అయితే పైన కుడిభాగంలో ఇమాజిన్ (grok Imagine) అనే ఆప్షన్ కనిపిస్తుంది.

ఈ ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. అందులో మీరు ఇమేజ్ సెలక్ట్ చేసుకుంటే వెంటనే దానిని వీడియోగా జనరేట్ చేస్తుంది. ఒకవేళ మీరు దానికి స్పీచ్ యాడ్ చేయాలి అనుకున్నా, ఫన్నీగా వీడియో జనరేట్ చేయాలని అనుకున్నా కుడి భాగంలో రిడూ అనే ఆప్షన్ పక్కన ఉన్న గుర్తుపై క్లిక్ చేయాలి. అంతే మీకు నచ్చినట్టు వీడియోను మార్చుకోవచ్చు. తరవాత వాటిని ఎక్స్‌లో షేర్ చేసుకోవచ్చు. గ్రోక్ ఈ వీడియోలను చాలా నాచురల్‌గా క్రియేట్ చేయడంతో చాలా మంది నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మీరు కూడా ఇమేజ్‌లను వీడియోలుగా మార్చాలని అనుకుంటే ఓ లుక్కేయండి.

Next Story