IFB 8 kg వాషింగ్ మెషిన్‌పై భారీ డిస్కౌంట్.. ఏఐ ఫీచర్స్‌తో సహా దీని ప్రత్యేకతలు ఇవే

by Ajay Maddhiboyina |

ఇటీవ‌ల కాలంలో వాషింగ్ మిష‌న్ల వినియోగం పెరిగిపోయింది. ఉద్యోగాల‌కు వెళ్ల‌డం, ఇత‌ర ప‌నుల కార‌ణంగా దుస్తుల‌ను వాష్ చేసుకోలేక మిష‌న్ల‌లోనే వేస్తున్నారు. దీంతో వాషింగ్ మిష‌న్ కంపెనీలు కూడా స‌రికొత్త ఫీచ‌ర్స్ తో ముందుకు వ‌స్తున్నాయి. ఇక ప్ర‌స్తుతం దీపావ‌ళి సేల్‌లో కూడా కొన్ని వాషింగ్ మిషన్లపై భారీ ఆఫర్స్ ఉన్నాయి.

IFB 8 kg వాషింగ్ మెషిన్‌పై భారీ డిస్కౌంట్.. ఏఐ ఫీచర్స్‌తో సహా దీని ప్రత్యేకతలు ఇవే
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవ‌ల కాలంలో వాషింగ్ మిష‌న్ల వినియోగం పెరిగిపోయింది. ఉద్యోగాల‌కు వెళ్ల‌డం, ఇత‌ర ప‌నుల కార‌ణంగా దుస్తుల‌ను వాష్ చేసుకోలేక మిష‌న్ల‌లోనే వేస్తున్నారు. దీంతో వాషింగ్ మిష‌న్ కంపెనీలు కూడా స‌రికొత్త ఫీచ‌ర్స్ తో ముందుకు వ‌స్తున్నాయి. ఇక ప్ర‌స్తుతం దీపావ‌ళి సేల్‌లో కూడా కొన్ని వాషింగ్ మిషన్లపై భారీ ఆఫర్స్ ఉన్నాయి. అందులో IFB 8 kg వాషింగ్ మిషన్ పై ఏకంగా రూ.11వేల డిస్కౌంట్ ఆఫ‌ర్ ఉంది. ఈ వాషింగ్ మిష‌న్ అస‌లు ధ‌ర రూ.43వేలు కాగా ప్ర‌స్తుతం ఫ్లిప్ కార్ట్ సేల్ లో రూ.31,990కే వ‌స్తుంది.

ఇందులో అత్యాధునిక ఏఐ ఫీచ‌ర్స్ ఉన్నాయి. ఇది పూర్తిగా ఆటోమెటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిష‌న్ కావ‌డం విశేషం. దీని RPM 1200లు కాగా ఎక్కువ స్పిన్ స్పీడ్ తో త‌క్కువ స‌మ‌యంలో కేవ‌లం 30 నిమిషాల్లోనే బ‌ట్ట‌ల‌ను ఉతికేస్తుంది. అంతే కాకుండా ఈ వాషింగ్ మిష‌న్ 5స్టార్ రేటింగ్ తో ఉండ‌గా క‌రెంట్ బిల్ కూడా త‌క్కువ వ‌స్తుంది. ఎక్కువ మురికిగా ఉన్న దుస్తుల‌ను వాష్ చేసేందుకు ఇందులో వేడి నీటిలో పిండేలా డీప్ క్లీన్ ఏఐ టెక్నాల‌జీ ఉంది. దుస్తుల బ‌రువు, దుస్తుల ర‌కాన్ని గుర్తించి వాటికి అనుగుణంగా వాష్ చేస్తుంది.

ఇందులో Fuzzy Logic, Hot Wash, Pre-wash Soak, Quick Wash, Spin & Rinse లాంటి ఆప్ష‌న్స్ ఉన్నాయి. అదే విధంగా మీ మొబైల్ ను వాషింగ్ మిష‌న్‌కు వైఫై ద్వారా కనెక్ట్ చేసి ఆపరేట్ చేయవచ్చు. వాషింగ్ మిషన్ దుస్తులు వాష్ చేయడం అయిపోయిన తరవాత ఫోన్‌కు నోటిఫికేన్ సైతం వస్తుంది. అంతే కాకుండా ఫోన్ ద్వారా మీకు కావాల్సిన మోడ్ ఎంచుకుని దుస్తులను శుభ్రం చేయొచ్చు. ఒకవేళ మీరు రూ.30వేలలో వాషింగ్ మిషన్ కొనుగోలు చేయాలని అనుకుంటే దీనిపై కూడా ఓ లుక్కేయండి.

Next Story