సబ్‌మెరైన్ సునామీలో చిక్కుకుంటే.. అందులో ఉన్న వారి పరిస్థితి ?

by Seetharam |   (  Updated:2023-06-27 07:03:04  IST  )

ఇటీవల సబ్‌మెరైన్ ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. పెరుగుతున్న విపత్తులకు తోడు టెక్నాలజీ కూడా రోజు రోజుకు కొత్త మార్పులతో దూసుకుపోతోంది.

సబ్‌మెరైన్ సునామీలో చిక్కుకుంటే.. అందులో ఉన్న వారి పరిస్థితి ?
X

దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల సబ్‌మెరైన్ ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. పెరుగుతున్న విపత్తులకు తోడు టెక్నాలజీ కూడా పెరుగుతూ వస్తుంది. అయినప్పటికీ ఎన్నో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవలే టైటానిక్ యాత్రకోసం సముద్రంలోకి వెళ్లిన సబ్‌మెరైన్ ప్రమాదానికి గురై ఐదుగురు వ్యక్తులు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. అయితే ఈ సబ్‌మెరైన్‌లు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో తయారు చేస్తున్నప్పటికీ అనుకోని విపత్తుల నుండి తప్పించుకోగలవా..? ఒకవేళ సముద్రంలో జలాంతర్గామి ప్రయాణిస్తున్నప్పుడు సునామీ వస్తే..? వాటిని తట్టుకోగలవా..? అనే ప్రశ్నకు సమాధానాలు కరువయ్యాయి. అయితే సునామీ సమయంలో సబ్‌మెరైన్‌లో ప్రయాణించే వారి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం..

సముద్ర గర్భంలో భూకంపాలు, అగ్ని పర్వతాల పేలుడు, కొండ చరియలు విరిగిపడటం వల్ల నీటిలో అలజడి ఏర్పడుతుంది. భూకంపం ఏర్పడిన ప్రదేశం నుండి ఈ అలజడి సముద్రంలో అన్ని వైపులా వ్యాపించి తీరాన్ని చేరుకుంటుంది. దీనినే సునామీ అంటారు. ఇందులో సుమారు డెబ్బై శాతం సునామీలకు భూకంపాలు కారణం అవుతున్నాయి. అయితే సునామీ సమయంలో సబ్‌మెరైన్‌లో ప్రయాణించే వారికి మాత్రం ఏమీ కాదు! ఎందుకంటే ఆ సబ్‌మెరైన్ తీరంలో కాకుండా సముద్ర మధ్యలో ఉంటుంది కాబట్టి.. అక్కడ అలల తీవ్రత తక్కువగా ఉంటుంది. అందుకే ప్రమాదం జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సునామీ ఏర్పడిన ప్రదేశం నుంచి తీరం వైపు కాకుండా సముద్రంలో ఎంత దూరంలో ఉన్నా ఆ సబ్‌మెరైన్‌కి సునామీ ప్రభావం ఏమీ ఉండదు.

ఎందుకంటే సునామీ సంభవించినప్పుడు నడి సముద్రంలో నీరు ఎక్కువ కుదుపులకి లోనవదు. లోతు జలాల్లో ఉన్న ఓడలు, జలాంతర్గాములు ఇలాంటి పొడుగు తరంగాల మీద సులభంగా తేలగలవు. సునామీ తరంగ వేగం నీటి లోతు మీద ఆధార పడి ఉంటుంది. అలలు తీరాన్ని సమీపించేటప్పుడు నీటి లోతు తగ్గుతూ ఉంటే తరంగ వేగం కూడా తగ్గిపోతుంది కానీ శక్తిని సంరక్షించడానికి వాటి తరంగ దైర్ఘ్యాన్ని తగ్గించుకుని, కంపన పరిమితిని పెంచేసుకుంటాయి. అందువల్ల తీరాన్ని సమీపించినప్పుడు మాత్రం ఎక్కువ కుదుపులకి లోనవుతూ అలలు భీకరంగా 15–30 మీటర్ల ఎత్తు వరకు ఎగసి పడతాయి. తీరంలో ఓడలు, పడవలు, జనావాసాలు మీద తమ ప్రతాపం చూపుతాయి. సునామీ అంటేనే జపనీయుల భాషలో ప్రమాదకర అలలు అని అర్ధం. ఇవి తీర ప్రాంతంలోనే ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి.

Next Story