200 మెగాఫిక్స‌ల్ తో హ‌న‌ర్ మొబైల్స్‌..లాంచింగ్ ఎప్పుడంటే!

by velandi.Saikiran |

హానర్ మ్యాజిక్ 8 సిరీస్, హానర్ మ్యాజిక్ V6 త్వ‌ర‌లోనే లాంచ్ కానున్నాయి. ఈ మొబైల్స్ కు 200-మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ల

200 మెగాఫిక్స‌ల్ తో హ‌న‌ర్ మొబైల్స్‌..లాంచింగ్ ఎప్పుడంటే!
X

దిశ, వెబ్ డెస్క్ : మార్కెట్ లోకి అనేక ర‌కాలు మొబైల్స్ వ‌స్తున్నాయి. సామాన్యులు కూడా కొనుగోలు చేసేలా.. మంచి ఫీచ‌ర్స్ ఉన్న ఫోన్స్ వ‌స్తున్నాయి. ఈ త‌రుణంలోనే.. హాన‌ర్ నుంచి అదిరిపోయే ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. హానర్ మ్యాజిక్ 8 సిరీస్, హానర్ మ్యాజిక్ V6 త్వ‌ర‌లోనే లాంచ్ కానున్నాయి. ఈ మొబైల్స్ కు 200-మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్లు అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ వెల్ల‌డించింది. మ్యాజిక్ 8 ఫోన్‌లు AI ఇంటిగ్రేషన్‌తో మ్యాజిక్ ఓఎస్ 10పై తీసుకువ‌స్తున్నారు.

ఇక హానర్ మ్యాజిక్ 8 సిరీస్ ఫోన్లు డిసెంబ‌ర్ స‌మాయానికి లేదా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో రానున్నాయని కంపెనీ వెల్ల‌డించింది. మ్యాజిక్ V6 సీరిస్ ఫోన్స్ కూడా 2026 మధ్యలో లాంచ్ కావచ్చు అని అంచ‌నా వేస్తున్నారు. అయితే.. ఈ రెండు మోడ‌ల్ ఫోన్లు.. 200 ఎంపీలతో వ‌స్తున్నాయ‌ట‌. కాగా గత నెలలో వ‌చ్చిన‌ మ్యాజిక్ V5 కు అప్డేటేడ్ వ‌ర్ష‌న్ గా వీ6 సీరిస్ రానుంద‌ని చెబుతున్నారు. వీ5 మోడ‌ల్స్ ఫోన్ల‌కు 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ ఉంటాయి.

Next Story