- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HMD Touch 4G: రూ.4 వేలకే టచ్ ఫోన్..అదిరిపోయే ఫీచర్స్ ఇదిగో !
దృష్టిలో పెట్టుకొని ఈ మొబైల్ ఫోన్ ను హెచ్ఎండీ టచ్ 4జీ పేరుతో ( hmd touch 4g ) లాంచ్ చేశారు. నోకియా బ్రాండ్ పైన ఫిన్లాండ

దిశ, వెబ్ డెస్క్ : ఇండియన్ మార్కెట్లోకి అనేక రకాల మొబైల్ ఫోన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా 5-జీ వేరియంట్స్ లోనే రకరకాల మొబైల్స్ వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో హెచ్ఎండీ పెద్ద సాహాసమే చేసింది. హెచ్ఎండీ నుంచి సరికొత్త 4జీ మొబైల్ లాంచ్ చేశారు. సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ మొబైల్ ఫోన్ ను హెచ్ఎండీ టచ్ 4జీ పేరుతో ( hmd touch 4g ) లాంచ్ చేశారు. నోకియా బ్రాండ్ పైన ఫిన్లాండ్ కు చెందిన ఈ హెచ్ఎండీ సంస్థ తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్స్ తీసుకువస్తోంది.
తాజాగా రిలీజ్ అయిన ఈ హెచ్ఎండీ టచ్ 4జీ 3.2 అంగుళాల డిస్ప్లే మాత్రమే ఉంటుంది. అలాగే 2000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. 2 ఎంపీ కెమెరా అందిస్తున్నారు. ఇక ఈ కొత్త 4జీ మొబైల్ ధర వచ్చేసి 4000 రూపాయలుగా ఫైనల్ చేశారు. అక్టోబర్ 9వ తేదీ నుంచి ఈ మొబైల్ విక్రయాలు కూడా ప్రారంభం అవుతాయి. ఈ మొబైల్స్ కేవలం రెండు కలర్స్ లో మాత్రమే లభిస్తాయి. హెచ్ఎండీ అధికారిక వెబ్సైట్, ఇతర ఈ కామర్స్ ఫ్లాట్ ఫార్మ్స్ లో కొనుగోలు చేయవచ్చు.






