Google:యూజర్ల కోసం గూగుల్ సరికొత్త ఆప్షన్.. స్కామ్ మెసేజ్‌లకు చెక్!

by Jakkula.Mamatha |   (  Updated:2025-03-05 14:18:24  IST  )

ఇటీవల కాలంలో సైబర్ మోసాలు(Cyber ​​fraud) ఎక్కువగా వెలుగులోకి రావడం గమనిస్తూనే ఉన్నాం

Google:యూజర్ల కోసం గూగుల్ సరికొత్త ఆప్షన్.. స్కామ్ మెసేజ్‌లకు చెక్!
X

దిశ,వెబ్‌డెస్క్: గూగుల్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్‌ను అనౌన్స్ చేసింది. ఇటీవల కాలంలో సైబర్ మోసాలు(Cyber ​​fraud) ఎక్కువగా వెలుగులోకి రావడం గమనిస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గూగుల్ కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. మోసపూరిత సందేశాలు పెరుగుతున్న క్రమంలో తన మేసేజింగ్ యాప్‌లో వాటిని గుర్తించి బ్లాక్ చేసే సదుపాయాన్ని తీసుకొచ్చింది. దీంతో పాటు ‘‘ఫైండ్ మై డివైజ్’’ యాప్ ద్వారా లొకేషన్ షేరింగ్, బ్రౌజర్‌లో ప్రైస్ ట్రాకింగ్ వంటి సదుపాయాలను కల్పించింది. SMS, MMS, RCSల ద్వారా వచ్చే సందేశాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో గుర్తిస్తుంది.

అయితే వాట్సప్ మెసేజింగ్ యాప్‌(WhatsApp messaging app) మాదిరిగానే గూగుల్(Google) ‘ఫైండ్ వై డివైజ్’ అప్లికేషన్ సాయంతో లైవ్ లొకేషన్ షేర్ చేయవచ్చు. ఇది మీ భద్రతకు సంబంధించింది. అంతేకాదు రియల్ టైమ్ మ్యాప్‌ను యాక్సెస్ చేసేందుకు కూడా అనుమతిస్తుంది. ఈ క్రమంలో లొకేషన్(Location) సమయం ఎంత యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నారో అనేది మీరే ఎంపిక చేసుకోవచ్చు.

ప్రస్తుత కాలంలో చాలా మంది ఆన్‌లైన్ షాపింగ్((Online Shopping) చేస్తున్నారు. సమయం ఆదా అవుతుందని, కొంచెం శ్రమ తగ్గుతుందనే ఉద్దేశంతో ఆన్‌లైన్‌లోనే తమకు కావాల్సిన వస్తువులను ఆర్డర్ పెట్టుకుంటున్నారు. అయితే ఈ ఆన్‌లైన్ షాపింగ్ చేసే సమయంలో ఆఫర్లు డిస్కౌంట్లు ఉండడం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఒక్కోసారి వస్తువుల ప్రైస్ హిస్టరీ(Price History) తెలుసుకొనేందుకు రకరకాల ఎక్స్ టెన్షను బ్రౌజర్ కు యాడ్ చేసుకుంటారు. దాని సాయంతో ధరల్ని ట్రాక్ చేయడం, ప్రైస్ అలర్ట్ లను సెట్ చేసుకుంటూ ఉంటాం. ఇకపై ఏదైనా వస్తువును గూగుల్ క్రోమ్(Google Chrome) ద్వారా వివరాలు తెలుసుకోవాలంటే అడ్రస్ బార్ లో ప్రైస్ ఆప్షన్ కనిపిస్తుంది. దాని పై క్లిక్ చేయగానే ప్రైస్ హిస్టరీని మీరు చూడవచ్చు.

Next Story