మీరే టార్గెట్ కావచ్చు.. జీమెయిల్ వినియోగదారులకు గూగుల్ వార్నింగ్

by Ajay Maddhiboyina |

ప్రపంచ వ్యాప్తంగా సుమారు 250 కోట్ల జీమెయిల్ వినియోగదారులకు గూగుల్ వార్నింగ్ ఇచ్చింది. అంతర్జాతీయ సైబర్ నేరగాళ్ల నుండి హ్యాకింగ్ దాడులు భారీగా పెరిగిపోయాయని, ఖాతాలపై తక్షణమే ప్రతిఒక్కరూ దృష్టి పెట్టాల‌ని సూచించింది.

మీరే టార్గెట్ కావచ్చు.. జీమెయిల్ వినియోగదారులకు గూగుల్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా సుమారు 250 కోట్ల జీమెయిల్ వినియోగదారులకు గూగుల్ వార్నింగ్ ఇచ్చింది. అంతర్జాతీయ సైబర్ నేరగాళ్ల నుండి హ్యాకింగ్ దాడులు భారీగా పెరిగిపోయాయని, ఖాతాలపై తక్షణమే ప్రతిఒక్కరూ దృష్టి పెట్టాల‌ని సూచించింది. యూజ‌ర్లు త‌మ పాస్‌వర్డ్‌లను మార్చుకోవడంతో పాటు టూ స్పెట్ వెరిఫికేషన్ అనే అదనపు ఫీచర్ ఖచ్చితంగా ఆన్ చూసుకోవాలని సూచించింది. చిన్నపాటి జాగ్రత్తల ద్వారా సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఖాతాలను సురక్షితంగా ఉంచుకోవాల‌ని పేర్కొంది.

ముఖ్యంగా సైబ‌ర్ దాడుల వెనుక షైనీహంటర్స్ అనే అంత‌ర్జాతీయ హ్యాక‌ర్ల ముఠా ఉంద‌ని గుర్తించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ ముఠా అనేక సంస్థ‌ల‌పై దాడులు చేసి సైబ‌ర్ మోసాల‌కు పాల్ప‌డిన‌ట్టు పేర్కొంది. గ‌తంలో ఐటీ అండ్ టీ, మైక్రోసాఫ్ట్, టికెట్ మాస్ట‌ర్ లాంటి దిగ్గ‌జ సంస్థ‌ల నుండి కీల‌క స‌మాచారాన్ని దొంగ‌లించ‌డంతో షైనీ హంట‌ర్స్ ఉన్న‌ట్టు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

హ్యాక‌ర్లు ఫిషింగ్ అనే ప‌ద్ధ‌తి ఉప‌యోగిస్తూ యూజ‌ర్ల‌ను న‌మ్మించేలా మెయిల్స్ పంపి వాటి ద్వారా మోస‌పూరిత పేజీల‌కు మ‌ళ్లిస్తున్న‌ట్టు గుర్తించారు. ఆ పేజీలోకి యూజ‌ర్లు వెళితే యూజ‌ర్ నేమ్, పాస్‌వర్డ్ ఎంటర్ చేయగానే వివరాలు హ్యాకర్ల చేతికి వెళతాయి. ప్రమాదాన్ని ముందే పసిగట్టిన గూగుల్ యూజర్లకు ఆగస్ట్ 8వ తేదీన ఈమెయిల్స్ పంపి వారిని అలర్ట్ చేసింది.

Next Story