గూగుల్ పిక్సెల్ వాచ్ 4 ఫోటోలు లీక్.. ధర, ఫీచర్స్ ఇవే !

by velandi.Saikiran |

గూగుల్ పిక్సెల్ వాచ్ 4 5 కలర్స్ లు ఉన్నాయి. ఈ వాచ్ సైజు 41 mm, 45 mm గా ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ధర 30000

గూగుల్ పిక్సెల్ వాచ్ 4 ఫోటోలు లీక్.. ధర, ఫీచర్స్ ఇవే !
X

దిశ, వెబ్ డెస్క్: మార్కెట్ లో స్మార్ట్ వాచ్ ల వినియోగం విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. ధర సామాన్యులకు అందుబాటులో ఉన్న నేపథ్యంలో అందరూ కూడా స్మార్ట్ వాచ్ లు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే గూగుల్ పిక్సెల్ వాచ్ 4 లాంచ్ కావడానికి సిద్ధమైంది. ఆగస్టు 20వ తేదీ అంటే ఇదే నెలలో ఈ వాచ్ మార్కెట్లోకి రాబోతోంది. అతి త్వరలోనే లంచ్ కాబోతున్న గూగుల్ పిక్సెల్ వాచ్ 4 ( Google Pixel Watch 4) ఏకంగా 5 కలర్స్ లో లభించే ఛాన్సులు ఉన్నాయి.

దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ వాచ్ సైజు 41 mm, 45 mm గా ఉంటుందని కంపెనీ వెల్లడించింది. అంటే ఈ వాచ్ రెండు సైజుల్లో మార్కెట్లో లభిస్తుంది. ఒకసారి ఫుల్ చార్జింగ్ పెడితే 72 గంటల పాటు వాచ్ వాడుకోవచ్చు. గూగుల్ పిక్సెల్ వాచ్ 4 ధర విషయానికి వస్తే 30000 నుంచి 34000 ఉంటుందని కంపెనీ వెల్లడించింది. అయితే ఫైనల్ రేటు మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదు. అయితే.. సాంసంగ్ గెలాక్సీ వాచ్ అలాగే ఆపిల్ వాచ్ కంటే ఎక్కువ ఫీచర్లు గూగుల్ పిక్సెల్ వాచ్ 4 లో ( Google Pixel Watch 4) ఉంటాయని అంచనా వేస్తున్నారు.

Next Story