- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Google Pixel 9 ఫోన్ పై ఏకంగా రూ. 15000 డిస్కౌంట్.. దీని ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే
Google Pixel 9: మీరు ప్రీమియం ఫీచర్లతో లభించే చక్కటి ఫోన్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా?
Google Pixel 9: Google Pixel 9 ఫోన్ పై ఏకంగా రూ. 15000 డిస్కౌంట్.. దీని ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే
దిశ, వెబ్ డెస్క్: Google Pixel 9: మీరు ప్రీమియం ఫీచర్లతో లభించే చక్కటి ఫోన్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే గూగుల్ పిక్సెల్ 9 ఓ చక్కటి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ ఫోన్ పై ప్రస్తుతం 15 వేల రూపాయల డిస్కౌంట్ ఆఫర్ నడుస్తోంది. మీరు ఒకవేళ ఈ ఫోన్ కొనుగోలు చేయాలి అనుకున్నట్లయితే దీని ధర అలాగే స్పెసిఫికేషన్లో డిస్కౌంట్ ఆఫర్ల గురించి తెలుసుకుందాం.
Google Pixel 9 లాంచింగ్ ధర సుమారు రూ. 79,999 నిర్ణయించారు. అయితే ఈ ఫోన్ పై ప్రస్తుతం విజయ్ సేల్స్ సంస్థ నేరుగా 5000 రూపాయలు తగ్గిస్తూ డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో ఈ ఫోన్ ధర ప్రస్తుతం రూ. 74,999 లకు తగ్గింది. అయితే ఈ ఫోన్ పై మరో డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. ఎవరైతే ఈ ఫోన్ ను హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు నో కాస్ట్ EMI పై కొనుగోలు చేస్తారో వారికి అదనంగా మరో రూ. 10,000 డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. దీంతో మొత్తం తగ్గింపు 15 వేల రూపాయలుగా చెప్పవచ్చు.
ఈ ఫోన్ ఫీచర్స్ విషయానికి వచ్చినట్లయితే, దీని డిస్‌ప్లే 6.9 అంగుళాల OLED స్క్రీన్, అలాగే ఇందులో 1080 x 2424 పిక్సెల్స్ రిజల్యూషన్, 2700 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్, HDR సపోర్ట్, గోరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఇందులో ప్రత్యేకతలుగా చెప్పవచ్చు. ఇక అలాగే ఇందులో కెమెరా విషయానికి వచ్చినట్లయితే మొత్తం రెండు కెమెరాలు వెనుకవైపు ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఉన్న బేసిక్ కెమెరా 50MP (OIS తో) సామర్థ్యంతో పనిచేస్తుంది. అలాగే వెనుకవైపు మరో కెమెరా కూడా ఉంది దీని లెన్స్ సామర్థ్యం కూడా 48MP కాగా, ఇది అల్ట్రావైడ్ కెమెరాగా ఉంది. ఇక సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే దీని సామర్థ్యం 10.5MP గా ఉంది.
ఈ ఫోన్ ప్రాసెసర్ అలాగే స్టోరేజ్ విషయానికి వచ్చినట్లయితే, గూగుల్ Tensor G4 ప్రాసెసర్, 12GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇందులో ప్రత్యేకతలుగా చెప్పవచ్చు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 4700mAh కెపాసిటీ, 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఇందులో చూడవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ నూతన వెర్షన్ అందుబాటులో ఉంది. అలాగే గూగుల్ కు సంబంధించిన అన్ని ఫీచర్స్ కూడా ఇందులో పనిచేస్తాయి. దీంతోపాటు దీనిలోని గూగుల్ లెన్స్ చాలా ప్రత్యేకం అని చెప్పవచ్చు.






