Google Pixel 10a: 5,100mAh బ్యాట‌రీతో కొత్త ఫోన్‌..ధ‌ర‌, అదిరిపోయే ఫీచ‌ర్స్ ఇవే

by velandi.Saikiran |

గూగుల్ నుంచి పిక్సెల్ 10ఏ ( Google Pixel 10a) అనే సరికొత్త మొబైల్ మార్కెట్ లోకి రాబోతోంది.

Google Pixel 10a:  5,100mAh బ్యాట‌రీతో కొత్త ఫోన్‌..ధ‌ర‌, అదిరిపోయే ఫీచ‌ర్స్ ఇవే
X

దిశ‌, వెబ్ డెస్‌: మార్కెట్లోకి అనేక రకాల మొబైల్ ఫోన్స్ వస్తున్నాయి. ఇందులో కొన్ని తక్కువ ధరలో ఉంటే, మరికొన్ని భారీ రేంజ్ లోనే ఉంటున్నాయి. సామాన్యులు కూడా కొనుగోలు చేసేలా కొన్ని కంపెనీలు తమ మొబైల్స్ ను తీసుకు వస్తున్నాయి. ఒక్కో మనిషి రెండు, రెండు ఫోన్లు వాడుతున్నారు. దానికి తగ్గట్టుగానే కంపెనీలు కూడా కొత్త ఫోన్స్ తీసుకు వస్తున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలోనే గూగుల్ సంస్థ నుంచి వచ్చే పిక్సెల్ ఫోన్లకు కూడా మార్కెట్లో మంచి గిరాకీ పెరిగింది. ఐఫోన్ తరహాలోనే సేఫ్టీ ఈ మొబైల్ ఫోన్లకు ఉంటుంది. దీంతో గూగుల్ నుంచి వచ్చే ఈ ఫిక్సెల్ మొబైల్స్‌ ను కొనుగోలు చేసేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు.

దీనికి తగ్గట్టుగానే గూగుల్ నుంచి పిక్సెల్ 10ఏ ( Google Pixel 10a) అనే సరికొత్త మొబైల్ మార్కెట్ లోకి రాబోతోంది. ఈ మేరకు కంపెనీ అధికారిక ప్రకటన చేసింది. అంతేకాదు గూగుల్ తన కొత్త స్మార్ట్ ఫోన్ Google Pixel 10a లాంచ్ గురించి కూడా తాజాగా టీజర్ రిలీజ్ చేసి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. వాస్తవంగా ఈ మొబైల్ ఫోన్ ను మార్చి లేదా మే మాసంలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఫిబ్రవరిలోనే రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. దీనికి తగ్గట్టుగానే ప్రీ-ఆర్డర్లు చేసుకునేలా కొత్త డేట్ ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 18వ తేదీ నుంచి ప్రీ ఆర్డర్లు ప్రారంభం అవుతాయని కంపెనీ వెల్లడించింది. అంటే ఫిబ్రవరి చివరలో ఈ Google Pixel 10a మొబైల్ రిలీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. దీనిపై డేట్ మాత్రం ఫైనల్ కాలేదని తెలుస్తోంది.

Google Pixel 10a ధ‌ర‌, ఫీచ‌ర్స్ ఇవే

గూగుల్ నుంచి లాంఛ్ అయ్యే Google Pixel 10a ఫోన్ ధ‌ర‌, ఫీచ‌ర్స్ ఒక‌సారి ప‌రిశీలిస్తే, 6.2 అంగుళాల డిస్ ప్లే క‌లిగి ఉన్న ఈ ఫోన్ Tensor G4, UFS 3.1 ఆధారం ప‌ని చేస్తుంది. 5100mAh బ్యాట‌రీ సామ‌ర్థ్యంతో ఈ ఫోన్ తీసుకువ‌స్తున్నారు. 20W ఉన్న ఛార్జ‌ర్ మాత్రమే Google Pixel 10a ఫోన్ కు స‌పోర్ట్ చేయ‌నుంది. 48MP 1/2" OIS + 13MP 1/3.1" UWతో ప్ర‌ధాన కెమెరా అందిస్తున్నారు. సెల్పీల కోసం 13 MP కెమెరా అందిస్తున్నారు. ఇక ఇండియాలో ఫిబ్ర‌వ‌రి 18 వ‌ర‌కు రిలీజ్ అయ్యే Google Pixel 10a ఫోన్ ధ‌ర రూ.45 వేల వ‌ర‌కు ఉంటుంద‌ట‌.

అయితే ఈ గూగుల్ పిక్సెల్ 10 ఏ ( ( Google Pixel 10a) ) మొబైల్ ఫోన్ కోసం ప్రత్యేక డిజైన్ రూపొందించారట. ఈ మొబైల్ వెనుక భాగంలో కెమెరా బంప్ లేకుండా ఉంటుందట. అంటే ఫ్లాట్ డిజైన్ తో ఈ ఫోన్ ను రూపొందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. అంటే ఈ ఫోన్ మనం చూస్తే మినిమలిస్ట్ గా కనిపిస్తుందన్నమాట. బ్లాక్, ఫాగ్, బెర్రీ, లావెండర్ కలర్స్ లో ఈ మొబైల్ లభిస్తుంది.

Next Story