5,100mAh బ్యాట‌రీతో గూగుల్ పిక్సల్ ఫోన్..ఏకంగా రూ. 3 వేల డిస్కౌంట్ !

by velandi.Saikiran |

5,100mAh బ్యాట‌రీతో వ‌చ్చిన‌ గూగుల్ పిక్సల్ 10a ఫోన్ ఇండియాలో లాంఛ్ అయింది.

5,100mAh బ్యాట‌రీతో గూగుల్ పిక్సల్ ఫోన్..ఏకంగా రూ. 3 వేల డిస్కౌంట్ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: భారత దేశంలో అనేక రకాల మొబైల్ ఫోన్స్ వస్తున్నాయి. ఇందులో తక్కువ ధరవి, ఖరీదైనవి కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరి చేతిలో ఒకటి కంటే ఎక్కువగా మొబైల్స్ కనిపిస్తున్నాయి. ఒకటి ఆఫీస్ కోసం, మరొకటి పర్సనల్ వినియోగాల కోసం మొబైల్స్ వాడుతున్నారు. ఇక మరి కొంత మంది అయితే చిన్నపిల్లల కోసం స్పెషల్ గా మొబైల్స్ కొనేస్తున్నారు. ఇలా భారతదేశ మార్కెట్ లో మొబైల్ ఫోన్స్ కు ఉన్న డిమాండ్ మరెక్కడ లేదని చెప్పవచ్చు. దీనికి తగ్గట్టుగానే ఆయా కంపెనీలు మంచి ఫీచర్స్ తో ఫోన్స్ లాంచ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గూగుల్ తన కంపెనీ నుంచి సరికొత్త ఫోన్ తీసుకువచ్చింది. ముందుగా చెప్పినట్లు గానే ఫిబ్రవరి 18వ తేదీన గూగుల్ పిక్సెల్ 10 ఏ ( Google Pixel 10a ) ఫోన్ అధికారికంగా లాంచ్ చేసింది కంపెనీ. ఈ మేరకు ప్రకటన చేసింది.

గూగుల్ పిక్సెల్ 10 ఏ ఫోన్ ఫీచర్స్, ధర ఎంత అంటే

సాధారణంగా గూగుల్ (Google ) నుంచి వచ్చిన మొబైల్ ఫోన్ లకు ఇండియాలో డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అని భావించి గూగుల్ కు సంబంధించిన ఫోన్స్ కొనుగోలు చేస్తారు. ఆపిల్, సాంసంగ్ లాంటి కంపెనీలతో పాటు జనాలు ఎక్కువగా గూగుల్ కు సంబంధించిన ఫోన్స్ కొంటారు. దాన్ని క్యాచ్ చేసుకున్న కంపెనీ తాజాగా గూగుల్ పిక్సెల్ 10 ఏ ( Google Pixel 10a ) పేరుతో సరికొత్త మొబైల్ ఫోన్ ను ఫిబ్రవరి 18వ తేదీన ఇండియాలో లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టంతో పని చేయగల Google Pixel 10a మొబైల్ ఫోన్.. ఇప్పుడు ఇండియన్ మార్కెట్ లో కొనుగోలు చేసేందుకు అందుబాటులోకి వచ్చింది.

మరి అలాంటి గూగుల్ పిక్సెల్ 10 ఏ ఫోన్ ఫీచర్స్ ఒకసారి పరిశీలిస్తే, 6.3 అంగుళాల ఈ ఫోన్‌ 120Hz Actua OLED డిస్ ప్లే క‌లిగి ఉంటుంది. టెన్స‌ర్ G4 ఆధారం ఈ ఫోన్ వ‌ర్క్ చేయ‌నుంది. 48MP (Main) + 13MP(UW) అరుదైన కెమెరాతో Google Pixel 10a ఫోన్ మార్కెట్ లోకి వ‌చ్చేసింది. సెల్ఫీల కోసం ఈ ఫోన్ లో 13 ఎంపీ పిక్సెల్ కెమెరా అందిస్తున్నారు. ఇక ఈ ఫోన్ 4 రంగుల్లో ల‌భించ‌నుంది. 5100mAh బ్యాట‌రీ సామర్థ్యంతో Google Pixel 10a తీసుకొచ్చారు. 30W Wired + 10W Wireless ఛార్జ‌ర్ మాత్ర‌మే ఈ ఫోన్ కు సపోర్ట్ చేయ‌నుంది. ఇక తాజాగా లాంఛ్ అయిన Google Pixel 10a ఫోన్ ధ‌ర‌ రూ. 49,999 గా ఫిక్స్ చేశారు. ఇక హెచ్ డీఎఫ్‌సీ బ్యాంకుకు సంబంధించిన క్రెడిట్ కార్డులు వాడితే, రూ.3000 వ‌ర‌కు డిస్కౌంట్ ల‌భించే ఛాన్స్ ఉంటుంద‌ట‌. ఎక్స్చేంజ్ ఆఫ‌ర్ కింద రూ.3000 త‌గ్గ‌నుంది ఈ ఫోన్‌.

Next Story