- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ పై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ.12,000 !
గూగుల్ పిక్సెల్ 10 ( Google Pixel 10) మొబైల్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించారు

దిశ, వెబ్ డెస్క్: మార్కెట్లో అనేక రకాల మొబైల్ ఫోన్స్ వస్తున్నాయి. మొబైల్ ఫోన్స్ రావడమే కాకుండా అదిరిపోయే ఆఫర్లు కూడా కంపెనీలు పెడుతున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో గూగుల్ పిక్సెల్ 10 ( Google Pixel 10) మొబైల్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ మొబైల్ ధర రూ.79,999 రూపాయలు ఉంది. ఇదే ధరకు మొబైల్ లాంచ్ అయింది. అయితే ఇప్పుడు అమెజాన్ లో ఈ ఫోన్ పై రూ.12000 డిస్కౌంట్ ప్రకటించారు.
అంటే ఈ మొబైల్ దాదాపు 69 వేలకే మనకు లభిస్తుంది. మొబైల్ కొనుగోలు చేసేటప్పుడు క్రెడిట్ కార్డులు వాడితే, మరింత డిస్కౌంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా మొత్తం పిక్సెల్ 10 మొబైల్ పై 12 వేల రూపాయల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇక ఈ మొబైల్ ఫీచర్స్ ఒకసారి పరిశీలిస్తే, 6.3 అంగుళాల డిస్ప్లే కలిగి ఉన్న ఈ ఫోన్ 4970 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. 30 w వైర్డ్ చార్జర్ సపోర్ట్ చేస్తుంది. 15w వైర్లెస్ చార్జింగ్ కు కూడా సపోర్ట్ చేస్తుంది ఈ ఫోన్. 48 ఎంపీ ప్రధాన కెమెరా కూడా అందిస్తున్నారు. సెల్ఫీల కోసం 10.5 ఎంపీ కెమెరా ఉంటుంది. ఈ మొబైల్ ఫోన్ లో గూగుల్ ప్రాసెసర్ టెన్సర్ G5 కూడా అందిస్తున్నారు.






