- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మొబైల్ యుజర్లకు అదిరిపోయే వార్త.. ఇకపై నో సిగ్నల్ ప్రసక్తే ఉండదు
ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ లేని వ్యక్తి ఉండడు. ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పట్టణాల్లోనే కాదు గ్రామాల్లో సైతం మొబైల్ ఫోన్ వాడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ లేని వ్యక్తి ఉండడు. ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పట్టణాల్లోనే కాదు గ్రామాల్లో సైతం మొబైల్ ఫోన్ వాడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అయితే, మారుమూల గ్రామాల్లో ఏదో ఒక నెట్‌వర్క్ సిగ్నల్ మాత్రమే అందుబాటులో ఉంటే, వేరే నెట్‌వర్క్ సిమ్ కార్డు వాడేవారికి ఇంటర్నెట్ స్లోగా వస్తుంటుంది. ఫోన్ కాల్స్‌లో అంతరాయం ఏర్పడుతుంది. ఇకపై ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కేంద్రం ఇంట్రా సర్కిల్ రోమింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. దీంతో జియో, ఎయిర్‌టెల్, BSNL ఏ నెట్‌వర్క్‌కు సంబంధించిన టవర్న్ అందుబాటులో ఉన్న.. వేరే నెట్‌వర్క్ వారికి సైతం సిగ్నల్ సమస్యలు ఉండవు. కేంద్ర టెలికం శాఖ తాజాగా దీనిపై ప్రకటన జారీ చేసింది.
అయితే, ఇంట్రా సర్కిల్ రోమింగ్ సదుపాయం 'డీజిటల్ భారత్ నిధి(DBN)' ద్వారా ఏర్పాటు చేసిన టవర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దేశంలో టెలికమ్యూనికేషన్ సర్వీసులు అందరికీ సమర్థవంతంగా, నాణ్యమైన రీతిలో అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ DBNను ప్రారంభించింది. ఇక ఇప్పుడు BSNL, జియో, ఎయిర్‌టెల్ సిమ్ కార్డులు వినియోగించే వినియోగదారులకు మాత్రమే ఈ ఇంట్రా సర్కిల్ రోమింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి.
దీనిని మొదటగా యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్‌గా నిర్వహించేవారు. కానీ, ఇప్పుడు దీనిని డిజిటల్ భారత్ నిధిగా మారుస్తూ, టెలికాం సేవల ప్రొవైడర్లు తమ వినియోగదారులకు 4జీ సేవలు అందించే టవర్లు ఏర్పాటు చేయడం ప్రారంభించారు. ఇక దేశవ్యాప్తంగా డీబీఎన్ నిధితో ఏర్పాటు చేసిన సుమారు 27,836 టవర్లు ఉన్నాయని, వీటి ద్వారా 35,400 మారుమూల గ్రామాలు లబ్ధి పొందనున్నాయని కేంద్ర టెలికం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.






