యాపిల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. అదిరే ఫీచర్లతో ఐఓఎస్‌ 26ను విడుదల

by Yella Dhawani Reddy |

ప్రముఖ టెక్ దిగ్గజ యాపిల్ (Apple) సంస్థ ఈసారి మరో సూపర్ సర్ప్రైజ్‌తో ముందుకొచ్చింది.

యాపిల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. అదిరే ఫీచర్లతో ఐఓఎస్‌ 26ను విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ టెక్ దిగ్గజ యాపిల్ (Apple) సంస్థ ఈసారి మరో సూపర్ సర్ప్రైజ్‌తో ముందుకొచ్చింది. జూన్ 9న కాలిఫోర్నియాలోని యాపిల్‌ పార్క్‌లో జరిగిన 'వరల్డ్‌ వైడ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌' (WWDC 2025)లో యాపిల్‌ వినూత్న ఆవిష్కరణలతో టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అందరూ ఊహించినట్లుగా iOS 19 కాకుండా ఈ ఈవెంట్‌లో నేరుగా iOS 26ను విడుదల చేసింది. ఇది కేవలం ఒక అప్‌డేట్‌ మాత్రమే కాదు.. గత పదేళ్లలో ఐఫోన్‌ సాఫ్ట్‌వేర్‌లో జరిగిన అతిపెద్ద మార్పు కూడా! గతంలో 2013లో iOS 7తో 'ప్లాట్ డిజైన్'ను పరిచయం చేసిన యాపిల్.. ఇప్పుడు 'లిక్విడ్ గ్లాస్' అనే కొత్త విజువల్ డిజైన్‌తో మళ్లీ ఒక కొత్త శకానికి నాంది పలికింది. ఇక కొత్త వర్షన్‌లో ఏఐ ఫీచర్లు, ఇంటరాక్టివ్ విజువల్స్‌, పెరిగిన కస్టమైజేషన్‌, కొత్త మ్యాప్స్‌, ఎమోజీ మేకింగ్ టూల్స్ వంటి అనేక ఫీచర్లను పరిచయం చేసింది. యాపిల్‌ 11, అనంతరం వచ్చిన కొత్త మోడళ్లకు ఐఓఎస్‌ 26 అప్‌డేట్‌ కానున్నట్టు కంపెనీ పేర్కొంది.

ఐఓఎస్‌ 26లో పలు కొత్త మార్పులు ఇవే..

* లిక్విడ్‌ గ్లాస్‌ డిజైన్‌తో హోమ్, లాక్ స్క్రీన్‌ పూర్తిగా కస్టమైజ్‌ చేయుకునే సదుపాయం.

* త్రీడీ ఎఫెక్ట్‌తో లాక్‌ స్క్రీన్‌ ఇమేజ్‌లను చూసే సౌలభ్యం

* మ్యూజిక్ ప్లే సమయంలో స్క్రీన్‌పై యానిమేటెడ్ విజువల్స్

* లైవ్ ట్రాన్స్‌లేషన్‌

* ఏఐ పవర్‌ షార్ట్‌కట్స్‌

* రైటింగ్‌ టూల్స్‌, ఇమేజ్‌ ప్లేగ్రౌండ్‌

* యూజర్ల ఇష్టానికి అనుగుణంగా కొత్త ఎమోజీలను రూపొందించుకునే ప్రత్యేక ఫీచర్.

* సరికొత్తగా యాపిల్‌ మ్యాప్స్‌

Next Story