Godrej: 2 శాతం పెరిగిన గోద్రెజ్ ప్రాపర్టీస్ షేర్లు

by Shamantha N |

గోద్రేజ్ ప్రాపర్టీస్ షేర్లు మంగళవారం 2 శాతం కంటే ఎక్కువగా పెరిగాయి. పుణెలోని అప్పర్ ఖరాడీ ప్రాంతంలో సుమారు 16 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు సంస్థ ప్రకటించింది.

Godrej: 2 శాతం పెరిగిన గోద్రెజ్ ప్రాపర్టీస్ షేర్లు
X

దిశ, బిజినెస్ : గోద్రేజ్ ప్రాపర్టీస్ షేర్లు మంగళవారం 2 శాతం కంటే ఎక్కువగా పెరిగాయి. పుణెలోని అప్పర్ ఖరాడీ ప్రాంతంలో సుమారు 16 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు సంస్థ ప్రకటించింది. ఈ భూమిని ప్రీమియం గృహ ప్రాజెక్టు, హై-స్ట్రీట్ రిటైల్ డెవలప్‌మెంట్‌గా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపింది. దీంతో గోద్రెజ్ ప్రాపర్టీస్ స్టాక్ మంగళవారం BSEలో గత ముగింపు రూ.2429.95తో పోలిస్తే 2.17 శాతం పెరిగి రూ.2482.90కి చేరింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.73,635 కోట్లుగా ఉంది. ఖరాడీ వాఘేలీ ప్రాంతంలో గోద్రెజ్ ప్రాపర్టీస్ సంస్థకు ఇది రెండో అతిపెద్ద భూమి కొనుగోలు. ఈ ప్రాంతంలో డెవలప్ మెంట్ అవకాశాలు పెరుగుతున్న సందర్భంగా గోద్రెజ్ ఇక్కడ మరో పెద్ద ప్రాజెక్టు చేపట్టనుంది. 2.5 మిలియన్ చదరపు అడుగుల సామర్థ్యంలో రూ. 3100 కోట్లతో ప్రాజెక్టు చేపట్టనుంది.

బెంగళూరలో మరో ప్రాజెక్టు

పుణే ప్రాజెక్టుతో పాటు గోద్రేజ్ ప్రాపర్టీస్ బెంగళూరులో మరో కొత్త ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్టును ప్రారంభిస్తోంది. ఈ ప్రాజెక్టు 14 ఎకరాల్లో రూ. 1,500 కోట్ల తో చేపట్టనుంది. ఈ సందర్భంగా గోద్రేజ్ ప్రాపర్టీస్ MD, CEO గౌరవ్ పాండే మాట్లాడుతూ.. అప్పర్ ఖరాడీ వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్టీ కారిడార్. పెరుగుతున్న మౌలిక సదుపాయాలు, బలమైన కనెక్టివిటీ కారణంగా భవిష్యత్ లో విశేష అవకాశాలు కలిగిన ప్రాంతంగా మారుతోంది. ఈ ప్రాంతంలో రెండో భూమిని కొనుగోలు చేశాం. పెరుగుతున్న పట్టణ ప్రాంతాల్లో ఉన్నత సామర్థ్యంతో విస్తరించాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు.

Next Story