రూ. 500 తగ్గింపు ధరలో కొత్త స్మార్ట్‌వాచ్

by Disha Web Desk 17 |
రూ. 500 తగ్గింపు ధరలో కొత్త స్మార్ట్‌వాచ్
X

దిశ, వెబ్‌డెస్క్:దేశీయ కంపెనీ గిజ్మోర్(Gizmore) కొత్తగా భారత్‌లో స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. ఈ మోడల్ పేరు ‘Gizmore GIZFIT Glow Z’. దీని ధర రూ. 1,999. అయితే లాంచ్ ఆఫర్‌లో భాగంగా రూ.1,499 తగ్గింపు ధరతో స్మార్ట్‌వాచ్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్, కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. వాచ్ ధరించడానికి అనువుగా ఉంటుంది.

ఇది 1.78-అంగుళాల 2.5D కర్వ్డ్ HD AMOLED స్క్రీన్‌తో 368×448 పిక్సెల్‌ల రిజల్యూషన్, 600 నిట్‌ల ప్రకాశంతో వస్తుంది. ఇన్‌బిల్ట్ మైక్రోఫోన్, బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ ఉంది. వినియోగదారులు కాల్స్ మాట్లాడటానికి ఇది కంఫర్ట్‌గా ఉంటుంది.హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్, హార్ట్ రేట్ సెన్సార్, ఇంకా 120కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లు, వాటర్ ఇన్‌టేక్ రిమైండర్‌లు, AI వాయిస్ అసిస్టెన్స్, వాతావరణ అప్‌డేట్‌లు, మల్టీ-లాంగ్వేజ్ సపోర్ట్ వంటి మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. నీటి నిరోధకత కోసం IP67-రేట్ చేయబడింది. అరగంట పాటు మీటరు లోతు వరకు నీటిలో మునిగిపోయినా వాచ్ పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది.

Next Story