మాల్‌లో కుక్కతో షాపింగ్ వెళ్లిన అమ్మాయి.. ఆశ్చర్యంతో చూసిన ప్రజలు

by Yella Dhawani Reddy |   (  Updated:2025-06-14 15:49:12  IST  )

ఓ అమ్మాయి మాల్‌కి తన కుక్కను వెంటబెట్టుకుని షాపింగ్‌కి వచ్చింది. ఇది చూసిన షాపర్లు, మాల్‌కి వచ్చిన ప్రజలు వాళ్ల పనులు ఆపుకుని మరీ ఆశ్చర్యంతో ఆ కుక్కను చూస్తూ, ఫోన్లలో వీడియోలు తీస్తూ ఆ కుక్కను గమనించారు.

మాల్‌లో కుక్కతో షాపింగ్ వెళ్లిన అమ్మాయి.. ఆశ్చర్యంతో చూసిన ప్రజలు
X

దిశ, వెబ్ డెస్క్: ఓ అమ్మాయి మాల్‌కి తన కుక్కను వెంటబెట్టుకుని షాపింగ్‌కి వచ్చింది. ఇది చూసిన షాపర్లు, మాల్‌కి (Mall) వచ్చిన ప్రజలు వాళ్ల పనులు ఆపుకుని మరీ ఆశ్చర్యంతో ఆ కుక్కను చూస్తూ, ఫోన్లలో వీడియోలు తీస్తూ ఆ కుక్కను గమనించారు. ఆశ్చర్యపోవడానికి ఆ కుక్కలో అంతా స్పెషలిటీ ఏముందని అనుకుంటున్నారా! నిజంగానే అది ప్రత్యేకమైనది. ఎందుకంటే.. అది రియల్ డాగ్ కాదు, రోబో డాగ్ (Robot Dog)! ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా (Viral) మారాయి.

అమెరికాలోని టెక్సాస్‌లో (Texas) ఉన్న సాన్ ఆంటోనియో నగరంలోని రివర్‌సెంటర్ మాల్‌కు ఓ అమ్మాయి రోబో డాగ్‌ను తీసుకుని వచ్చింది. అమ్మాయి కుక్కకు లీష్‌(పెంపుడు జంతువులను నియంత్రించడానికి ఉపయోగించే తాడు లేదా గొలుసు) కట్టి నడిపిస్తుండటం వీడియోలో చూడొచ్చు. ఇక కుక్క శరీరం మెటల్‌తో తయారై ఉంది, కానీ నడక, తల తిప్పడం, అటు ఇటు తిరిగే మోమెంట్స్ అన్నీ నిజమైన కుక్కలా ఉన్నాయి. ఈ రోబో డాగ్ ఒక్కసారిగా మాల్‌లో ప్రత్యేక్షమవటంతో అక్కడి షాపర్లు, ప్రజల దృష్టిని ఆకర్షించింది. వారు ఈ దృశ్యాన్ని ఫోన్లలో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేయగా, క్షణాల్లో వైరల్‌గా మారింది. ఇక దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కాగా, ఈ ఘటన టెక్నాలజీ మన జీవితాల్లోకి ఎంత వేగంగా ప్రవేశిస్తుందో స్పష్టంగా చూపిస్తోంది. రోబోలను కేవలం పరిశ్రమలకే పరిమితం కాకుండా, వీటిని వ్యక్తిగత జీవితాల్లోనూ ఉపయోగించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారు.

Click For Instagram post..

Next Story