- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ Apple iPhone ధర కేవలం రూ. 52 లక్షలు మాత్రమే!
by Harish |
Apple ఫోన్లకు ఉండే క్రేజ్ చాలా మందికి తెలిసిందే. ఒక్కసారైనా దీన్ని వాడాలని అనుకుంటారు.

X
దిశ, వెబ్‌డెస్క్: Apple ఫోన్లకు ఉండే క్రేజ్ చాలా మందికి తెలిసిందే. ఒక్కసారైనా దీన్ని వాడాలని అనుకుంటారు. ఎందుకంటే దీనికి ఉన్న స్పెసిఫికేషన్లు, ధర కారణంగా అంత డిమాండ్ ఉంటుంది. అయితే మాములుగా ఐఫోన్ల ధరలు గరిష్ఠంగా సుమారు రూ. ఒక లక్షకు పైగా ఉంటాయి. కానీ ఒక Apple ఫోన్ ధర మాత్రం రూ. 52 లక్షలు. అవును మీరు విన్నది నిజమే. ఇటీవల అమెరికాలో యాపిల్ కంపెనీ నుంచి వచ్చిన ఫస్ట్ జనరేషన్‌కు చెందిన ఐఫోన్‌ను LCG Auctions వెబ్‌సైట్‌లో వేలం వేశారు.
అయితే ఈ వేలంలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఫోన్ ధర అత్యధికంగా రూ. 52 లక్షలు పలికింది. ఈ ఫోన్ 2007 లో యపిల్ కంపెనీ నుంచి వచ్చిన ఫస్ట్ జనరేషన్ ఫోన్. దీనిని ఇంకా సీల్ కూడా తీయలేదు. రూ.2.06 లక్షల ప్రారంభ ధరతో వేలం మొదలుపెట్టగా అందరి అంచనాలను దాటుకుని రూ. 52 లక్షలకు పైగా అమ్ముడుపోయింది.
Next Story






