అనుమతులు మంజూరు.. ఇకపై భారత్‌లోనూ ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ సేవలు

by Gantepaka Srikanth |

భారత్‌(India)లో స్టార్ లింక్ ఇంటర్నెట్(Star Link Internet) సేవలకు అనుమతి లభించింది.

అనుమతులు మంజూరు.. ఇకపై భారత్‌లోనూ ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ సేవలు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌(India)లో స్టార్ లింక్ ఇంటర్నెట్(Star Link Internet) సేవలకు అనుమతి లభించింది. దేశంలో మూడో ఇంటర్నెట్ కంపెనీగా స్టార్ లింక్ ఏర్పాటు కాబోతోంది. ఈ విషయాన్ని ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉంటే.. ఎలాన్‌మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ సంస్థ స్టార్‌లింక్‌ ఇంటర్నెట్ సర్వీసులను అందిస్తోంది. శాటిలైట్‌ టెక్నాలజీ ద్వారా హైస్పీడ్‌, తక్కువ లేటెన్సీతో ఇంటర్నెట్‌ సర్వీసులను అందించనుంది. ఇప్పటికే తమ కస్టమర్లకు స్టార్‌ లింక్‌ సేవలను అందించేందుకు దేశీయ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్‌ ఇప్పటికే స్టార్‌ లింక్‌తో ఒప్పందం చేసుకున్నాయి. మారుమూల ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలందించేందుకు స్టార్‌ లింక్‌ ఉపయోగపడుతుంది. సగటున 50 ఎంబీపీఎస్‌ నుంచి 150 ఎంబీపీఎస్‌ వేగంతో ఈ సేవలు లభిస్తాయి. స్పేస్‌ఎక్స్‌ అనుబంధ స్టార్‌లింక్‌ ఇప్పటికే శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలను 100 దేశాల్లో అందిస్తోంది.

Next Story